ఇరాన్‌కు ట్రంప్ 48 గంటల డెడ్‌లైన్.. లేకపోతే ? | trump threatens to obliterate iran power plants | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు ట్రంప్ 48 గంటల డెడ్‌లైన్.. లేకపోతే ?

Mar 22 2026 7:03 AM | Updated on Mar 22 2026 11:23 AM

 trump threatens to obliterate iran power plants

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు భారీ వార్నింగ్ ఇచ్చారు.  వచ్చే 48 గంటల్లోగా హర్మూజ్ జలసంధిని తెరిచి వాణిజ్య రవాణాకు ఎటువంటి అవాంతరాయం కలగకుండా చూడాలన్నారు. లేకపోతే  యుఎస్‌ఏ  సంయుక్త రాష్ట్రాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా  దాడి చేస్తాయని తెలిపారు.

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తున్నా ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు కాదు కదా మరింత పెరుగుతున్నాయి. నిన్న( శనివారం) ఇరాన్ తన ప్రాంతానికి 4వేల కిలోమీటర్ల దూరంలోని  డిగో గార్సియా దీవిలోని అమెరికా స్థావరంపై దాడి చేసి అందరిని షాక్‌కు గురిచేసింది. దీంతో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.

తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు. " 48 గంటల్లోగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే అమెరికా ఆ దేశంలోని అన్ని పవర్‌ ప్లాంట్లపై దాడికి తెగబడుతుంది. వాటిలో అతిపెద్దదానిపై మెుదటగా దాడి చేస్తుంది". అని తన ట్రూత్‌ పోస్టులో రాసుకొచ్చారు.

అయితే నిన్న ట్రంప్ యుద్ధంపై భిన్నంగా స్పందించారు. అమెరికా యుద్ధం విషయంలో ఇదివరకే తన లక్షాలను చేరుకుందని కనుక సైనిక చర్యను తగ్గించే విషయంలో ఆలోచిస్తున్నామన్నారు. కాగా ఈ రోజు మరోసారి ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement