పుతిన్‌, జిన్‌పింగ్‌కు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్ | Trump thanks Chinas Xi, Russias Putin for being neutral in Iran war | Sakshi
Sakshi News home page

పుతిన్‌, జిన్‌పింగ్‌కు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్

Jun 18 2026 12:33 AM | Updated on Jun 18 2026 12:33 AM

Trump thanks Chinas Xi, Russias Putin for being neutral in Iran war

ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తటస్థ వైఖరి అవలంబించారని, అందుకు తాను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.

ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా చేపట్టిన చర్యలకు బీజింగ్‌, మాస్కో అడ్డంకులు సృష్టించలేదని పేర్కొన్నారు. అవసరమైతే వారు పరిస్థితిని మరింత క్లిష్టం చేయగలిగేవారు. కానీ అలా చేయలేదు. అందుకే వారికి ధన్యవాదాలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి జిన్‌పింగ్‌ను ట్రంప్‌ ప్రశంసలతో ముంచెత్తాడు.

ఓ పక్క చైనా, రష్యా అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్‌, తమ మిత్రదేశాలైన జపాన్‌, కొన్ని యూరోపియన్ దేశాలు హోర్ముజ్ జలసంధి సంక్షోభ సమయంలో తగిన సహకారం అందించలేదని విమర్శించారు.

ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా చైనా, రష్యాలపై తరచూ విమర్శలు గుప్పించే ట్రంప్, ఈసారి వారిని బహిరంగంగా ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement