పాక్‌ మునీర్‌తో ట్రంప్‌ ఫోన్‌ కాల్‌.. అంతలోనే షాక్‌ | Trump Speaks With Pakistan Army Chief Asim Munir About Ongoing West Asia Conflict Amid Iran Mediation, Check Out More Details | Sakshi
Sakshi News home page

పాక్‌ మునీర్‌తో ట్రంప్‌ ఫోన్‌ కాల్‌.. అంతలోనే షాక్‌

Mar 24 2026 9:37 AM | Updated on Mar 24 2026 9:53 AM

Trump speaks with Pakistan Army Chief Asim Munir amid Iran mediation

వాషింగ్టన్‌: ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌తో చర్యలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ వేదికగా ఇరాన్‌, అమెరికా మధ్య చర్యలు జరుగుతాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీన్ని వైట్‌హౌస్‌ వర్గాలు ఖండించాయి. చర్యలు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.

అయితే, ఇరాన్‌తో ట్రంప్‌ చర్యల నేపథ్యంలో పాకిస్తాన్‌ సైనాధికారి ఆసిమ్‌ మునీర్‌తో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడినట్టు వార్తలు బయటకు వచ్చాయి. మధ్యవర్తిత్వానికి ఆయనే ఉండాలని కోరినట్టు కథనాలు పేర్కొన్నాయి. ఇదేసమయంలో అమెరికా-ఇరాన్ చర్చలకు వేదికగా ఇస్లామాబాద్‌ను  పాకిస్తాన్ ప్రతిపాదించినట్టు మరో వార్త కూడా బయటకు వచ్చింది. ఇది ఒక ముఖ్యమైన దౌత్యపరమైన ముందడుగు అంటూ పలు కథనాలు వెలువడ్డాయి.

ఈ క్రమంలో పాక్‌లో మధ్య వర్తిత్వ చర్చల కథనాలపై వైట్‌హౌస్‌ స్పందించింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌, జారెడ్‌ కుష్నెర్‌లు ఇరాన్‌ ప్రతినిధులతో ఇస్లామాబాద్‌లో భేటీ కానున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. ఈ కథనాలు ఊహాజనితమని కొట్టేశారు. చర్యలకు వేదికపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఎలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే తామే వెల్లడిస్తామని కుండబద్దలు కొట్టారు. దీంతో, పాక్‌ అనుకూల కథనాలకు తెరపడినట్టు అయ్యింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement