Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Top 10 Telugu Latest Current News Evening Headlines 20th April 2022 - Sakshi

జహంగీర్‌పురి కూల్చివేతలు.. మేయర్‌ స్పందన
ఢిల్లీ జహంగీర్‌పురి బుల్డోజర్‌ కూల్చివేతలపై ఢిల్లీ మేయర్‌ స్పందించారు. శనివారం మత ఘర్షణలు జరిగిన ప్రాంతంలోనే.. బుల్డోజర్లు రంగంలోకి దిగడంతో విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే.

అదంతా మీడియా సృష్టే: కాకాణి
నెల్లూరు జిల్లాలో కీలక నేతల మధ్య వైరం అంటూ వస్తున్న మీడియా కథనాలపై మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఖండించారు. అనిల్‌ తనకు సోదరుడిలాంటి వాడని, కేవలం జిల్లా అభివృద్ధి పనుల కోసమే సీఎం జగన్‌తో భేటీ అయ్యామని ఆయన అన్నారు.

ఉక్రెయిన్‌ తర్వాత మరో రెండు దేశాలకు..
ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యకు దిగి.. ప్రపంచాన్ని వణికిస్తు‍న్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. తాజాగా మరో రెండు దేశాలకు హెచ్చరికలు జారీ చేశాడు.

ఐపీఎల్‌కు సైన్మా ఫీవర్‌
ఐపీఎల్ 2022 సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకున్న బీసీసీఐను రెండు పాన్‌ ఇండియా సినిమాలు భారీగా దెబ్బకొట్టాయి. అవి రెండూ సౌత్‌ సినిమాలు కావడం, ఆడియొన్స్‌లో క్రేజ్‌ ప్రభావం ఐపీఎల్‌ వ్యూయర్‌షిప్‌పై పడింది.

కిషన్‌రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణలో రైస్‌ మిల్లుల్లో అవకతవకలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ‍్యలు చేశారు.కొన్ని రైస్ మిల్లులలో అవకతవకలు జరిగాయన్నారాయన. 

నజ్రియా మీద నాని ఆసక్తికర వ్యాఖ్యలు
అంటే సుందరానికి.. టీజర్‌ లాంఛ్‌ సందర్భంగా హీరో నాని, తెలుగులో డెబ్యూ ఇస్తున్న మలయాళ నటి నజ్రియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఎగబడి మరీ కొంటున్నారు
స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్‌ 5 స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే! వాటి ప్రత్యేకతలేంటంటే..

అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ యాప్‌
దిశ తరహాలో అవినీతి ఫిర్యాదులకుగానూ ఏసీబీ యాప్‌ తేవాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. అధికారులకు సూచించారు. తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో హోం శాఖపై బుధవారం సమీక్ష నిర్వహించి.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌కు పేరు పెట్టిన మోదీ
గుజరాత్‌లో గ్లోబల్‌ ఆయుష్‌ సమ్మిట్‌ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా టెడ్రోస్‌ని కొత్త పేరుతో పిలుస్తానంటూ మోదీ చెప్పారు.

ఫార్ములా వన్‌ స్టార్‌కు చేదు అనుభవం
అభిమానులు ఫార్ములా వన్‌ స్టార్‌ చార్లెస్ లెక్లెర్‌కు బిగ్‌ షాకిచ్చారు. తనను కలవడానికి వచ్చిన అభిమానుల్లో గుర్తుతెలియని ఒక వ్యక్తి చార్లెస్‌ చేతికున్న ఖరీదైన వాచ్‌ను కొట్టేశాడు. ఆ వాచ్‌ ఖరీదు ఎంతో తెలుసా?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top