Afghanistan: మహిళా శాఖ ఎత్తేశారు.. ఇప్పుడు మహిళా మంత్రికే దిక్కులేదు

Taliban Govt Appoint Deputy Ministers With All Men - Sakshi

పురుషులతో నిండిన మంత్రివర్గం

కొత్త ఉప మంత్రుల ఎంపిక

మహిళలపై రోజురోజుకు ఆంక్షలు పెంచుతున్న తాలిబన్ల ప్రభుత్వం

కాబూల్‌: అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు అఫ్తానిస్తాన్‌లో మహిళలపై వివక్ష తీవ్రంగా చూపిస్తున్నారు. మహిళలపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధిస్తున్న తాలిబన్ల ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొన్న మహిళా శాఖను ఎత్తేసిన ఆపద్ధర్మ ప్రభుత్వం ఇప్పుడు మంత్రివర్గాన్ని విస్తరించగా వారిలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదు. 1990 కాలాన్ని మళ్లీ తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
చదవండి: యువతకు గుడ్‌న్యూస్‌.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే..

ఈ విషయాన్ని ఆ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. ఇటీవల అఫ్గాన్‌లో ప్రధానమంత్రితో పాటు మంత్రివర్గాన్ని ఎన్నుకున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రివర్గాన్ని విస్తరించింది. ఈ సందర్భంగా ఉప మంత్రులను ఎన్నుకున్నారు. అయితే ఆ ఉప మంత్రుల్లోనూ.. కేబినెట్‌ మంత్రుల్లోనూ ఒక్క మహిళకు చోటు కల్పించలేదు. అయితే దీనిపై జబిహుల్లా స్పందిస్తూ ‘ఇది తాత్కాలిక ప్రభుత్వమే. భవిష్యత్‌లో మార్పులు జరుగుతాయి’ అని స్పష్టం చేశాడు.
చదవండి: గురజాడ అప్పారావుకు సీఎం జగన్‌ ఘన నివాళి

మొత్తం మహిళలను ఇంటికే పరిమితం చేయాలని అఫ్గాన్‌ పాలకులు నిర్ణయించారు. ఇటీవల ఓ ప్రతినిధి ‘మహిళలు పిల్లలు కనడానికి మాత్రమే పనికి వస్తారు. మంత్రులుగా కాదు’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. మహిళా వ్యవహారాల శాఖను మూసేసిన తాలిబన్లు ధర్మ ప్రచార మంత్రిత్వ శాఖగా మార్చేశారు. ఆదివారం రాజధాని కాబూల్‌ మునిసిపాలిటీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఇళ్ల వద్దనే ఉండిపోవాలని హుకుం జారీ చేశారు.

ఇక యువతులు, మహిళలు చదువుకునే హక్కును కాలరాస్తున్నారు. కేవలం పాఠశాల విద్యకే మహిళలను పరిమితం చేస్తున్నారు. అఫ్గాన్‌ పరిణామాలను అంతర్జాతీయ సమాజం ఖండిస్తోంది. అయితే అంతర్జాతీయంగా ఎంతటి విమర్శలు వచ్చినా కూడా తాలిబన్లు మహిళలపై వివక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. షరియా చట్టాలకు అనుగుణంగా తమ పాలన ఉంటుందని తాలిబన్లు ఎప్పుడో ప్రకటించారు. తదనుగుణంగా వారి పాలన సాగుతోంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top