బొగ్గు దిగుమతుల్లో అక్రమాల ఆరోపణలు | Sri Lanka energy minister Kumara Jayakody quits as president orders coal probe | Sakshi
Sakshi News home page

బొగ్గు దిగుమతుల్లో అక్రమాల ఆరోపణలు

Apr 18 2026 5:42 AM | Updated on Apr 18 2026 5:42 AM

Sri Lanka energy minister Kumara Jayakody quits as president orders coal probe

శ్రీలంక ఇంధన మంత్రి రాజీనామా 

కొలంబో: విద్యుదుత్పత్తిలో వాడే బొగ్గు దిగుమతుల్లో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలున్న శ్రీలంక ఇంధన శాఖ మంత్రి కుమార జయకోడి పదవికి రాజీనామా చేశారు. ఆ శాఖ కార్యదర్శి ఉదయాంగ హేమపాల కూడా బాధ్యతల నుంచి వైదొలిగారు. ప్రభుత్వ రంగ సంస్థ చేపట్టిన బొగ్గు దిగుమతుల్లో ఆరోపణలపై శ్రీలంక అధ్యక్ష కార్యాలయం స్పందించింది. అయితే, అవకతవకల కారణంగా ప్రభుత్వ ఖజానాకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. 

దీనిపై ఆరునెలల్లో ప్రత్యేక కమిటీతో దర్యాప్తు పూర్తి చేసి, వాస్తవాలను వెల్లడిస్తామని తెలిపింది. అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కుమార జయకోడి గతవారం పార్లమెంట్‌లో ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కారు. శ్రీలంక తన ఇంధన అవసరాలకు కావాల్సిన బొగ్గును ఏడాదికి 25 లక్షల టన్నుల చొప్పున ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియాలతోపాటు స్వల్ప పరిమాణంలో భారత్‌ నుంచి కూడా దిగుమతి చేసుకుంటోంది.  


 

Advertisement
 
Advertisement
Advertisement