భారత ఆందోళనను లెక్కచేయని శ్రీలంక.. చైనా నిఘా నౌకకు అనుమతి

Sri Lanka Allows Controversial Chinese Ship Despite Indias Concerns - Sakshi

కొలంబో: భారత్‌ ఆందోళనలను బేఖాతర్‌ చేస్తూ చైనా హైటెక్‌ నిఘా నౌక యువాన్‌ వాంగ్‌ 5 లంగరు వేయడానికి శ్రీలంక అనుమతులు మంజూరు చేసింది. దక్షిణ రేవు పట్టణమైన హంబన్‌టొటలో ఆగస్టు 16 నుంచి 22 వరకు ఉండడానికి అనుమతినిచ్చినట్టు శనివారం అధికారులు వెల్లడించారు. యువాన్‌ వాంగ్‌ 5 నౌక ఖండాంతర క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాలను ట్రాక్‌ చేయగలదు.

ప్రస్తుతం ఈ నౌక ప్రయాణిస్తున్న పరిధిలోకి మన దేశ అణు పరిశోధనా కేంద్రాలన్నీ వస్తాయి. అందుకే భారత్‌ ఈ నౌక రాకపట్ల అభ్యంతరం చెబుతూ దానిని అడ్డుకోవాలంటూ శ్రీలంకపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. భారత్‌ ఆందోళనల్ని శ్రీలంక విదేశాంగ శాఖ చైనా దృష్టికి తీసుకువెళుతూ నౌక తమ జలాల్లోకి రావడానికి తొలుత అనుమతినివ్వలేదు. దీంతో 11వ తేదీ గురువారమే హంబన్‌టొట రేవుకి చేరుకోవాల్సిన యువాన్‌ నౌక ప్రయాణాన్ని గతంలో ఆపడం తెల్సిందే. 

చదవండి: (సామూహిక మతమార్పిడులకు పదేళ్ల జైలు) 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top