పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తప్పిన పదవీ గండం

Speaker Of Pak National Assembly Rejects No Confidence Motion Against Imran - Sakshi

No Confidence Motion Against Imran Khan, ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. ఇమ్రాన్‌ఖాన్‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించారు. ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్ర ఉందన్న స్పీకర్‌.. పాక్‌ జాతీయ అసెంబ్లీని ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. 

కాగా, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే క్రమంలో జాతీయ అసెంబ్లీకి ఇమ్రాన్‌ఖాన్‌ హాజరు కాలేదు. అదే సమయంలో జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ఇమ్రాన్‌ఖాన్‌ సిఫారుసు చేశారు. అంటే అవిశ్వాస తీర్మానం కాకుండా నేరుగా ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్‌ భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ ఆమోదించకపోవడంతో ఇమ్రాన్‌ఖాన్‌కు అతి పెద్ద ఊరట లభించినట్లయ్యింది. ఫలితంగా ఇమ్రాన్‌ఖాన్‌కు పదవీ గండం తప్పింది. 

ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి ఎలాగైనా దింపేందుకు అవసరమైన బలాన్ని విపక్షాలు కూడగట్టాయి. నేటి అవిశ్వాస తీర్మానంలో భాగంగా ఇమ్రాన్‌ఖాన్‌  పార్టీ పీటీఐ నుంచి 22 మంది మాత్రమే జాతీయ అసెంబ్లీకి హాజరు కాగా, విపక్షాల నుంచి 176 మంది హాజరయ్యారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానాన్ని కానీ స్పీకర్‌ ప్రవేశపెట్టి ఉంటే ఇమ్రాన్‌ ఖాన్‌ తన పదవిని కోల్పోయేవారు. రాజీనామా చేయడం, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడని ఇమ్రాన్‌.. మళ్లీ నేరుగా ఎన్నికలకు వెళ్లాలనే భావించాడు. ఈ క్రమంలోనే జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లడానికి సిఫారుసు చేశారు. ఇమ్రాన్‌ సిఫారుసుతో పాక్‌లో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. 

అనంతరం ఇమ్రాన్‌ఖాన్‌ జాతినుద్దేశించి మాట్లాడారు. పాక్‌లో ఎన్నికలకు సిద్ధం కావాలని ఇమ్రాన్‌ పిలుపునిచ్చారు. తనపై కుట్ర జరిగిందని, అది కూడా విదేశీ కుట్రలో భాగంగానే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారన్నారు. మరొకవైపు పాక్‌ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్‌)ను ఆ దేశాధ్యక్షుడు అరిఫ్‌ అల్వీ రద్దు చేశారు. ముందుస్తు ఎన్నికలకు పాక్‌ అధ్యక్షుడు పిలుపు నిచ్చారు. ఫలితంగా పాక్‌లో ముందుస్తు ఎన్నికలు జరగడం ఖాయమైంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top