గురకపెట్టే వారికి కరోనా ముప్పు ఎక్కువ! | Snorers Are Three Times Risk Of Corona | Sakshi
Sakshi News home page

గురకపెట్టే వారికి కరోనా ముప్పు ఎక్కువ!

Sep 21 2020 7:08 PM | Updated on Sep 21 2020 7:43 PM

Snorers Are Three Times Risk Of Corona - Sakshi

గుర్రు పెడుతూ నిద్రపోయే వారిలో కండరాలు విశ్రాంతి తీసుకున్నప్పుడు కొన్ని క్షణాలపాటు తాత్కాలికంగా శ్వాసనాళంలోకి గాలి సరిగ్గా పోదని, ఫలితంగా వారికి ప్రాణాపాయం ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. 

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల్లో గురక పెట్టి పడుకునే వాళ్లు ఉన్నట్లయితే వారి ప్రాణాలకు మూడు రెట్లు ముప్పు ఎక్కువని పరిశోధకులు తేల్చారు. కరోనా వైరస్, నిద్రకున్న సంబంధంపై ఇప్పటి వరకు జరిపిన 18 అధ్యయనాలను వార్‌విక్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చారు. గుర్రు పెడుతూ నిద్రపోయే వారిలో కండరాలు విశ్రాంతి తీసుకున్నప్పుడు కొన్ని క్షణాలపాటు తాత్కాలికంగా శ్వాసనాళంలోకి గాలి సరిగ్గా పోదని, ఫలితంగా వారికి ప్రాణాపాయం ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. 

గుర్రు పెట్టేవాళ్లకు కరోనా సోకడం ఒక రిస్క్‌ ఫ్యాక్టరేకానీ, అదనపు రిస్క్‌ ఫ్యాక్టర్‌ కాదని పరిశోధకులు చెప్పారు. అంటే స్థూలకాయం, రక్తపోటు, మధుమేహం ఉన్నట్లయితే ఆ మూడే వారికి రిస్క్‌ ఫ్యాక్టర్లని, వారిలో గురుకపెట్టే వారున్నట్లయితే వారికి అది అదనపు రిస్క్‌ ఫ్యాక్టర్‌ కాబోదని కూడా పరిశోధకలు తెలిపారు. వాస్తవానికి ఈ మూడు అనారోగ్య సమస్యలున్న వారందరికి గురకపెట్టే అలవాటు వస్తుందని వారు చెప్పారు. ఇంగ్లండ్‌లో 15 లక్షల మంది, అమెరికాలో 2.20 కోట్ల మంది గురక సమస్యతో బాధ పడుతున్నారు. 
(చదవండి: నిద్రపట్టడం లేదని..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement