గాల్లోనే పొట్ట చీల్చుకుని బయటకొచ్చింది!

Snake Eel Comes Out From A Herons Stomach - Sakshi

న్యూయార్క్‌ : అమెరికాకు చెందిన సామ్‌ డేవిస్‌ అనే ఫొటోగ్రాఫర్‌ కొద్దిరోజుల క్రితం మేరీల్యాండ్‌లోని అటవీ ప్రాంతంలో వన్య మృగాలను ఫొటోలు తీసేపనిలో బిజీగా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత గాల్లో ఎగురుతున్న హెరాన్‌( నారాయణ పక్షి) కనిపించింది. అందులో వింతేమీ లేదు కానీ, దాని పొట్టబాగంలో ఓ స్నేక్‌ ఈల్‌ వేలాడుతూ ఉంది. అది హెరాన్‌ పొట్టకు అతుక్కుందని భావించాడు మొదట. కానీ, అది దగ్గరకు వచ్చిన తర్వాత విషయం అర్థమై షాక్‌ తిన్నాడు. హెరాన్‌ మింగిన స్నేక్‌ ఈల్‌ దాని పొట్టను చీల్చుకుని బయటకు వచ్చింది. అలా గాల్లో పక్షితో పాటు ఎగురుతూ ఉండిపోయింది. ( పాపం: ఇరుకింట్లో 164 కుక్కలు )

దీనిపై సామ్‌ మాట్లాడుతూ.. ‘‘ స్నేక్‌ ఈల్స్‌ అనేవి ఈల్‌ జాతికి చెందినవి. ఇవి ఎక్కువగా సముద్ర తీరాల్లోని బురద, ఇసుక ప్రాంతాల్లో నివసిస్తుంటాయి.  ఏదైనా జీవి వీటిని సజీవంగా తిన్నప్పుడు అవి తమ పదునైన తోకను ఉపయోగించి బయటపడటానికి ప్రయత్నిస్తాయి. పొట్టలో జీర్ణం అవకుండా ఉండటానికి అలా చేస్తాయి. ఈల్‌ పొట్టను చీల్చినా హెరాన్‌ బ్రతికి ఉండటం అశ్చర్యంగా ఉంది. మామూలుగా అయితే అంత పెద్ద గాయం అయిన తర్వాత ఏ జీవైనా వెంటనే చనిపోతుంది’’ అని తెలిపాడు. ( ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకరినే మ‌నువాడారు! ) 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top