వీడియో: అగ్నిపర్వతంపై సాహసం.. పట్టుజారితే బూడిద కూడా దొరకదు.. స్లాక్‌లైన్ వాక్‌లో గిన్నిస్‌ రికార్డు

Slackline Walk Over Active Volcano Guinness World Record Video - Sakshi

వైరల్‌: రఫెల్‌ బ్రిడి, అలెగ్జాండర్ షుల్జ్.. ఇప్పుడు తమ పనితో ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్నారు. ప్రాణాల్ని పణంగా పెట్టి చేసి వీళ్ల సాహసం ఇప్పుడు వైరల్‌ అవుతోంది. స్వయంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ వాళ్లే ఈ జంట చేసిన సాహసాన్ని సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది మరి. 

నైరుతి పసిఫిక్‌ మహాసముద్రంలోని టన్నా ఐల్యాండ్‌లోని వనాటు వద్ద యసుర్‌ అగ్నిపర్వం మీద వీళ్లు స్లాక్‌లైన్ నడక సాహసం చేశారు. అగ్నిపర్వతం అడుగు నుంచి సుమారు 137 అడుగుల ఎత్తులో ఒక తాడుపై ఎలాంటి ఆధారం లేకుండా వీళ్ల నడక కొనసాగింది. కింద నుంచి అగ్నికీలలు ఎగసిపడుతున్నా సుమారు 261 మీటర్ల దూరం నడక సాగించి.. గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకున్నారు ఈ ఇద్దరూ. 

రఫెల్‌ జుంగో బ్రిడి బ్రెజిల్‌కు చెందిన సాహసికుడు కాగా, అలెగ్జాండర్ షుల్జ్ జర్మనీకి చెందిన వ్యక్తి. సాహసమే వీళ్లిద్దరి ఊపిరి. గతంలో వీళ్లిద్దరి పేర్ల మీద పలు రికార్డులు కూడా ఉన్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top