breaking news
rope walking
-
అగ్నిపర్వతంపై సాహసం.. పట్టుజారితే బూడిద కూడా దొరకదు.. స్లాక్‌లైన్ వాక్‌లో గిన్నిస్ రికార్డు
-
చావుతో చెలగాటం.. అయినా ఈ సాహసాన్ని చూసేయండి
వైరల్: రఫెల్ బ్రిడి, అలెగ్జాండర్ షుల్జ్.. ఇప్పుడు తమ పనితో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నారు. ప్రాణాల్ని పణంగా పెట్టి చేసి వీళ్ల సాహసం ఇప్పుడు వైరల్ అవుతోంది. స్వయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్లే ఈ జంట చేసిన సాహసాన్ని సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది మరి. నైరుతి పసిఫిక్ మహాసముద్రంలోని టన్నా ఐల్యాండ్‌లోని వనాటు వద్ద యసుర్ అగ్నిపర్వం మీద వీళ్లు స్లాక్‌లైన్ నడక సాహసం చేశారు. అగ్నిపర్వతం అడుగు నుంచి సుమారు 137 అడుగుల ఎత్తులో ఒక తాడుపై ఎలాంటి ఆధారం లేకుండా వీళ్ల నడక కొనసాగింది. కింద నుంచి అగ్నికీలలు ఎగసిపడుతున్నా సుమారు 261 మీటర్ల దూరం నడక సాగించి.. గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు ఈ ఇద్దరూ. రఫెల్ జుంగో బ్రిడి బ్రెజిల్‌కు చెందిన సాహసికుడు కాగా, అలెగ్జాండర్ షుల్జ్ జర్మనీకి చెందిన వ్యక్తి. సాహసమే వీళ్లిద్దరి ఊపిరి. గతంలో వీళ్లిద్దరి పేర్ల మీద పలు రికార్డులు కూడా ఉన్నాయి. -
అల.. ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో గురూ!
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అంటే ఇదేనేమో.. అసలే.. రోప్ వాకింగ్.. గాలికి ఊగుతా ఉంది.. ముందుకెలా వెళ్లాలో తెలియదంటే.. వెనక్కు మళ్లడానికి వీల్లేకుండా.. మింగేయడానికి వస్తున్నట్లు ఈ రాకాసి అల ఒకటి.. ఫొటో సూపర్ కదూ.. పోర్చుగల్‌లోని నజరే తీరంలో ఓ సాహసి తాడుపై నడుస్తుండగా.. వెనుక నుంచి రాకాసి అల ఒకటి విరుచుకుపడుతున్న దృశ్యాన్ని ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఐడాన్ విలియమ్స్ క్లిక్‌మనిపించారు. 2018 నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పోటీలో ‘పీపుల్స్’విభాగంలో వచ్చిన వేలాది ఎంట్రీల్లోనుంచి ఎడిటర్ చాయిస్ కింద కొన్ని చిత్రాలను ఎంపిక చేశారు. అందులో ఇది కూడా ఒకటి. ఈ పోటీ విజేతలను త్వరలో ప్రకటించనున్నారు. -
పట్టు తప్పితే 'అదో గతే'
-
పట్టు తప్పితే 'అదో గతే'