
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అంటే ఇదేనేమో.. అసలే.. రోప్ వాకింగ్.. గాలికి ఊగుతా ఉంది.. ముందుకెలా వెళ్లాలో తెలియదంటే.. వెనక్కు మళ్లడానికి వీల్లేకుండా.. మింగేయడానికి వస్తున్నట్లు ఈ రాకాసి అల ఒకటి.. ఫొటో సూపర్ కదూ..
పోర్చుగల్‌లోని నజరే తీరంలో ఓ సాహసి తాడుపై నడుస్తుండగా.. వెనుక నుంచి రాకాసి అల ఒకటి విరుచుకుపడుతున్న దృశ్యాన్ని ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఐడాన్ విలియమ్స్ క్లిక్‌మనిపించారు. 2018 నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పోటీలో ‘పీపుల్స్’విభాగంలో వచ్చిన వేలాది ఎంట్రీల్లోనుంచి ఎడిటర్ చాయిస్ కింద కొన్ని చిత్రాలను ఎంపిక చేశారు. అందులో ఇది కూడా ఒకటి. ఈ పోటీ విజేతలను త్వరలో ప్రకటించనున్నారు.