నమ్మశక్యం కాని అనుభవం | Sakshi
Sakshi News home page

నమ్మశక్యం కాని అనుభవం

Published Tue, Jul 13 2021 4:47 AM

Shirisha Bandla Says Space travel is a miracle - Sakshi

హ్యూస్టన్‌: అంతరిక్షం నుంచి భూగోళాన్ని వీక్షించడం నమ్మశక్యం కాని, జీవితాన్ని మార్చే గొప్ప అనుభవమని ఇండియన్‌ అమెరికన్, తెలుగు బిడ్డ శిరీష బండ్ల  పేర్కొన్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థకు చెందిన వీఎస్‌ఎస్‌ యూనిటీ–22 స్పేస్‌షిప్‌లో రిచర్డ్‌ బ్రాన్‌సన్, మరో నలుగురితో కలిసి ఆమె ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. రోదసిలో తనకు ఎదురైన అనుభవాన్ని శిరీష సోమవారం ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

స్పేష్‌షిప్‌లో అంతరిక్షంలోకి వెళ్లడం, క్షేమంగా భూమిపైకి తిరిగి రావడం.. మొత్తం ప్రయాణం ఒక అద్భుతమన్నారు. తన అనుభవాన్ని వర్ణించడానికి ‘నమ్మశక్యం కాని’ కంటే మరో ఉత్తమమైన పదం కోసం వెతుకుతున్నానని, ప్రస్తుతానికి ఆ పదమే తన మదిలో మెదులుతోందని అన్నారు. రోదసి నుంచి మన భూమిని వీక్షించడం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. రోదసిలోకి వెళ్లాలన్నది తన కల అని, అదిప్పుడు సాకారమయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. వ్యోమగామి కావడం చిన్నప్పటి నుంచి తన లక్ష్యమని చెప్పారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
 
Advertisement