మండే సూర్యుడి నేలను.. మంచు ముద్దాడితే! | Sakshi
Sakshi News home page

రియల్‌ ఫొటోస్‌: మంచు కమ్మేసింది! యస్‌.. ఇది సహారా ఎడారినే!

Published Fri, Jan 21 2022 7:56 PM

Sahara Desert Snow Fall 2022 Photos Viral - Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. చీకటి ఖండం ఆఫ్రికాలో సుమారు పదకొండు దేశాలతో సరిహద్దును పంచుకుంటూ.. నిప్పు కణికల్లాంటి సూర్య తాపాన్ని ముద్దాడుతున్న నేల. అలాంటి ఇసుక తిన్నెలపై అరుదైన దృశ్యం(అలాగని కొత్తేం కాదు) చోటు చేసుకుంది.


మహా ఎడారిని ఆనుకుని ఉన్న అయిన్‌ సెఫ్రా(అల్జీరియా)లో మంచు కురిసింది. దీంతో ఎర్రటి నేల మీద తెల్ల మంచు దుప్పటి పర్చుకుంది. 

సహారాలో వేడిమి అధికం. ప్రస్తుతం 58 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అవుతోంది.

అయితే అల్జీరియా నామా ప్రావిన్స్‌కి ఉత్తరం వైపున ఉన్న అయిన్‌ సెఫ్రాలో మాత్రం మైనస్‌ రెండు డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతకు పడిపోవడంతో ఇలా జరిగింది.

 

ఇదిలా ఉంటే  అయిన్‌ సెఫ్రాను సహరా గేట్‌వేగా అభివర్ణిస్తుంటారు. అట్లాస్‌ పర్వతశ్రేణుల్లో, సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ప్రాంతం. గత 42 ఏళ్లలో ఇలా జరగడం ఇది ఐదవసారి. 1979, 2016, 2018, 2021లోనూ ఇలా జరిగింది.

అయిన్‌ సెఫ్రాలో వేసవిలో గరిష్ఠంగా 37 డిగ్రీలు, శీతాకాలంలో కనిష్టంగా మైనస్‌ పది డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు అవుతుంటుంది. చల్ల గాలులపై ఒత్తిడి ప్రభావంతో ఇలా శీతల పరిస్థితి నెలకొంటుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. 2018లో ఏకంగా 40సెం.మీ. హిమపాతం నమోదు అయ్యింది ఇక్కడ.

Advertisement
 
Advertisement
 
Advertisement