ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు | Russian attack kills eight in Ukraine after trump strikes diesel | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు

Oct 10 2026 4:50 PM | Updated on Oct 10 2026 5:10 PM

Russian attack kills eight in Ukraine after trump strikes diesel

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు జరిపింది. ఈ రోజు (శనివారం)  జపొరిజియా ప్రాంతంలో క్షిపణులతో విరుచుకపడింది. ఈ దాడులలో కనీసం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే రష్యాతో డీజిల్‌ కొనుగోలు విషయంలో ఒప్పందం కుదిరిందని ట్రంప్‌ ప్రకటించిన మరోసటే రోజే ఈ దాడులు జరిగాయి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ డీజిల్‌ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిపై  ఉక్రెయిన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యా నుంచి డీజిల్‌ కొనుగోలు చేయడం ద్వారా ఆ దేశానికి ఆదాయం లభిస్తుందని, ఆ నిధులను మాస్కో తన సైనిక చర్యలకు, యుద్ధాన్ని కొనసాగించడానికి వినియోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రష్యాపై ఆంక్షలను సడలించడం ద్వారా ఆ దేశానికి యుద్ధాన్ని కొనసాగించేందుకు ఆర్థిక వనరులు సమకూరుతాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ తీవ్రంగా విమర్శించారు.

ఈ విమర్శలు జరిగి 24 గంటలైనా కాకముందే రష్యా ఉక్రెయిన్‌పై విరుచుకపడింది.శనివారం జపొరిజియా ప్రాంతంలో రష్యా జరిపిన దాడుల్లో కనీసం ఎనిమిది మంది మరణించారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ది వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం ప్రకారం.. గత నాలుగు రోజుల్లో ఉక్రెయిన్‌ అంతటా రష్యా జరిపిన దాడుల్లో 55 మందికి పైగా మరణించారు. వీరిలో జపొరిజియా ప్రాంతంలోనే కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ ప్రకటించిన డీజిల్‌ ఒప్పందం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అమెరికాలో పెరుగుతున్న ఇంధన ధరలను నియంత్రించడంతోపాటు వినియోగదారులు, వ్యాపార సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. అయితే, రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్ల ఆ దేశానికి అదనపు ఆదాయం సమకూరి, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత కాలం కొనసాగించే అవకాశం లభిస్తుందని ఉక్రెయిన్‌ అధికారులు వాదిస్తున్నారు.

రష్యా నుంచి భారీగా డీజిల్‌ దిగుమతులు
ఈ ఒప్పందం ప్రకారం రష్యా నుంచి తొలుత 3 లక్షల టన్నులకు పైగా డీజిల్‌ను వెంటనే సరఫరా చేయనున్నట్లు సమాచారం. అనంతరం నవంబర్‌లో మరో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత అదనంగా 10 లక్షల టన్నులు, కొద్ది వ్యవధిలో మరో 30 లక్షల టన్నుల డీజిల్‌ను సరఫరా చేయనున్నట్లు కథనంలో పేర్కొన్నారు.

అమెరికాలో ఇంధన సరఫరాను స్థిరీకరించడం, ధరలను తగ్గించడం లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రక్కుల రవాణా రంగం, రైతులు, పశుపోషకులు, సాధారణ కుటుంబాలపై పెరుగుతున్న ఇంధన వ్యయాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి. ఇరాన్‌కు సంబంధించిన సంఘర్షణతో సహా అంతర్జాతీయ పరిణామాల కారణంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఇంధన ధరలను అదుపులో ఉంచడం అమెరికాకు కీలకంగా మారింది.

ఇదీ చదవండి: పుతిన్‌కు ట్రంప్ ఆఫర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement