Russia Ukraine War: ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం.. అమెరికాకు రష్యా హెచ్చరిక

Russia Warns US Over Providing Weapons To Ukraine - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఉధృతం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు సైనిక సహాయం అందిస్తామన్న అమెరికా ప్రకటనపై రష్యా స్పందించింది. యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌కు ఆమెరికా సైనికసాయం అందిస్తే.. తీవ్రమైన పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని రష్యా హెచ్చరించినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపిస్తామన్న జో బైడెన్‌ ప్రకటనపై రష్యా.. అమెరికా, నాటోను తీవ్రంగా వ్యతిరేకించింది. ఉక్రెయిన్‌కు అమెరికా  ఆయుధసాయం చేస్తే అనూహ్యమైన పరిణామాలు నెలకొంటాయని హెచ్చరించింది.

అయితే అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌.. ఉక్రెయిన్‌కు రూ.80 కోట్ల హెలికాప్టర్లు, హెవిట్జర్లు, సాయుధ సిబ్బంది క్యారియర్లను సాయంగా అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే రష్యా.. అమెరికాను హెచ్చరించడం గమనార్హం. అయితే మరోవైపు.. ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్లను ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌ను ఆయుధపరంగా శక్తిమంతం చేసేందుకు అమెరికా యత్నిస్తున్నట్లు​ సమాచారం. ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ల పరిధి 1,850 కిలోమీటర్లు ఉంటుంది. ఇవి గరిష్ఠంగా గంటకు 482 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయి. సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో పలు ఆపరేషన్లలో వీటిని యూఎస్‌ఏ ఉపయోగించిన విషయం తెలిసిందే. ఐసిస్, అల్ఖైదా ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక కమాండర్లను హతమార్చడంలో ఈ డ్రోన్లు కీలకపాత్ర పోషించిన సంగతి విదితమే.

చదవండి:  Russia-Ukraine war: మాస్క్‌వా మునిగింది

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top