Russia-Ukraine War Day 9 Live Updates In Telugu | Russia Ukraine War Latest News - Sakshi
Sakshi News home page

రష్యా విధ్వంసం.. మూడో విడత చర్చలకు ఉక్రెయిన్‌ యత్నం!

Published Fri, Mar 4 2022 7:40 AM

Russia Ukraine War Telugu Latest Updates Day 9 - Sakshi

Russia-Ukraine War Day 9 LIVE Updates: భారీ నష్టం జరుగుతున్నా..  రష్యా దళాలను ఉక్రెయిన్‌ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. గెరిల్లా తరహా యుద్ధవ్యూహాలతో  రష్యా సైన్యం చొచ్చుకురాకుండా అడ్డుకునేందుకు  శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. రష్యా సైన్యం కనీవినీ ఎరుగని రీతిలో బాంబులు, క్షిపణి దాడులతో హడలెత్తిస్తోంది. తొమ్మిదవ రోజూ యుద్ధం కొనసాగుతోంది.

► ఉక్రెయిన్‌లోని యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లిర్ ప్లాంట్ అయిన జిప్రోజియా న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా బలగాలు దాడి నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి శుక్రవారం ఉదయం 11.30 నిమిషాలకు (న్యూయార్క్‌ కాలామాణం ప్రకారం) అత్యవసర సమావేశం కానుంది.

 ఈ వారాంతంలో రష్యా అధికారులతో మూడవ రౌండ్ చర్చలు జరపాలని ఉక్రెయిన్ యోచిస్తోందని ఆ దేశ అధ్యక్ష సలహాదారు పేర్కొన్నారు. మరోవైపు బెలారస్‌లో గురువారం జరిగిన రెండో విడత చర్చల్లో యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి పౌరులను సురక్షితంగా పంపించేందుకు వీలుగా సేఫ్‌ కారిడార్లను నిర్వహించాలని ఇరు వర్గాలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  పౌరుల తరలింపు సమయంలో ఆయా మార్గాల్లో కాల్పులు కూడా విరమించేందుకు అంగీకరించాయి.

 ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ దేశం విడిచి పారిపోయినట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్‌ వీడి ప్రస్తుతం పోలాండ్‌లో ఉన్నారని రష్యన్‌ మీడియా పేర్కొంది. అయితే ఇంతకముందు కూడా జెలెన్‌స్కీ దేశం విడిచిపెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఈ ఈ వార్తలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు కొట్టిపారేశారు. తాను రాజధాని కీవ్‌లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. మరీ ప్రస్తుత వార్తలు ఎంత వరకు నిజమో తేలాల్సి ఉంది.
పూర్తి కథనానికి ఇక్కడ క్లిక్‌ చేయండి

 రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో దాదాపు 20 వేలకు పైగా భారతీయులు ఉక్రెయిన్‌ వీడినట్లు కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 18 విమానల్లో 4 వేల మంది స్వదేశానికి చేరుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ దేశంలో రెండు నుంచి మూడు వేల మంది భారతీయులు ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.

వీరిలో కనీసం 1,000 మంది భారతీయులు.. తూర్పు ఉక్రెయిన్‌లో సంఘర్షణ ప్రాంతాలు సుమీలో 700 మంది, ఖార్కివ్‌లో 300 మంది చిక్కుకుపోయారని అంచనా వేసింది. వారిని తరలించడానికి బస్సులను ఏర్పాటు చేయడం ప్రస్తుతం అతిపెద్ద సవాలుగా మారిందని కేంద్రం శుక్రవారం తెలిపింది. అయితే చివరి వ్యక్తిని తరలించే వరకు తాము ఆపరేషన్ గంగాను కొనసాగిస్తామని వెల్లడించింది. .

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా ఉక్రెయిన్‌ ప్రజలు ఇతర దేశాలకు తరలి వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. వీరిలో దాదాపు అయిదు లక్షలమంది యువత ఉన్నట్లు తెలిపింది. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్‌ఆర్‌) అత్యవసరంగా స్వతంత్ర​ అంతర్జాతీయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించి. ఈ మేరకు ఓటింగ్‌ నిర్వహించింది.  ఈ కౌన్సిల్‌లో మొత్తం 47 దేశాలు ఉండగా. భారత్‌ మరోసారి ఈ ఓటింగ్‌ ప్రక్రియకుదూరంగా ఉంది.  అయితే ఈ తీర్మానానికి అనుకూలంగా 32 ఓట్లు వచ్చాయి. భారత్‌, చైనా, పాకిస్థాన్‌, సుడాన్‌ సహా 13 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అయితే అనుకూల దేశాలు ఎక్కువగా ఉండటంతో తీర్మానం ఆమోదం పొందింది.

► రష్యన్‌ బలగాలు జరుపుతున్న దాడి కారణంగా ఉక్రెయిన్‌లోని నగరాలు శ్మశానాలుగా మారాయి.


ప్రపంచంలోనే అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా..
ఉక్రెయిన్‌లోని హోస్టోమెల్ విమానాశ్రయంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఆంటోనోవ్ యాన్-225 విమానాన్ని రష్యన్‌ బలగాలు ధ్వంసం చేశాయి. స్థానిక మీడియా దీనికి సంబంధించిన ఓ వీడియోని ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

ఉక్రెయిన్‌ సైన్యం చేతిలో 9,166 మంది రష్యా సైనికులు హతం.. 33 విమానాలు, 37 హెలికాప్టర్లు, 2 బోట్లు, 60 ఇంధన ట్యాంకులు, 404 కార్లు, 251 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్‌ ప్రకటన. 

న్యూక్లియర్‌ ప్లాంట్‌ స‍్వాధీనం.. రష్యా సైన్యం యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ జాపోరిజ్జియా న్యూక్లియర్‌ ప్లాంట్‌ సైట్‌ను స్వాధీనం చేసుకుంది. కాగా, శుక్రవారం ఉదయం ప్లాంట్‌పై దాడులు జరిపిన కొన్నిగంటల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

అణు విద్యుత్‌ కేంద్రంపై రష్యా దాడిని ప‍్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఈ దాడిపై యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో.. ఉక్రెయిన్‌ అధ‍్యక్షుడు జెలెన్‌ స్కీకి ఫోన్‌ చేసి దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంరతం అణు విద్యుత్‌ కేంద్రంపై దాడి రష్యాకు ఆమోద యోగ్యం కాదన్నారు. అక్కడ దాడులను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు.

కొనసాగుతున్న ఆపరేషన్‌ గంగ. ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు ముమ్మరం. హిండన్‌ ఎయిర్‌బేస్‌కు ఈ ఉదయం చేరుకున్న రెండు విమానాలు.

► యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్‌ ప్లాంట్‌ అయిన జాపోరిజ్జియా న్యూక్లియర్‌ప్లాంట్‌పై రాకెట్‌ దాడులు జరిగాయి. దీంతో  ప్లాంట్‌ అగ్నికీలకల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని ఆ నగర మేయర్‌ ధృవీకరించారు. ఇది గనుక పేలితే చెర్నోబిల్‌ కంటే పదిరెట్లు నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 ఎనర్హోదర్‌ను స్వాధీనం చేసుకునేదిశగా రష్యా. ఉక్రెయిన్‌కు నాలుగో వంతు కరెంట్‌ ఇక్కడి నుంచే ఉత్పత్తి.

► చెర్నిహివ్‌లో రష్యా దాడులు. 22 మంది దర్మరణం పాలైనట్లు చెర్నిహివ్‌ గవర్నర్‌ ప్రకటించారు.

► ఉక్రెయిన్‌ యుద్దంలో మరో విద్యార్థికి గాయాలయ్యాయి. రాజధాని కీవ్‌లో ఆ విద్యార్థి గాయపడి చికిత్స పొందుతున్నట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్‌ వెల్లడించారు. కీవ్‌ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు గుర్తు చేశారాయ.  యుద్ధ సమయంలో బుల్లెట్‌ అనేది జాతీయత, ప్రాంతీయత చూడదని ఆయన వ్యాఖ్యానించారు.

► నేరుగా తనతోనే చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కోరాడు. అప్పుడే యుద్ధం ఆగే మార్గం దొరుకుతుందని అన్నారు. మరోవైపు యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. ప్లాన్‌లు ఇవ్వాలని, యుద్ధ విమానాలు, ఆయుధాలు అందించాలని పశ్చిమ దేశాలను కోరుతున్నాడాయన.

► యధాతధంగా రష్యా సైన్యం దాడులు కొనసాగుతాయని ఓ టెలివిజన్‌ ప్రసంగం ద్వారా పుతిన్‌ ప్రకటించారు. 

గురువారం ఉక్రెయిన్‌ రష్యా ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయి. పౌరులను సురకక్షిత కారిడార్‌ గుండా తరలింపునకు ఇరు దేశాలు అంగీకరించాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement