Russia-Ukraine War: రష్యాకే జైకొట్టిన ఉక్రేనియన్లు.. త్వరలో లాంఛనంగా విలీనం!

Russia Ukraine Conflict To Enter New Stage After Referendums - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లోని డొనెట్స్‌క్, లెహాన్స్‌క్, జపోరిజియా, ఖెర్సన్‌ తదితర ఆక్రమిత ప్రాంతాలను లాంఛనంగా విలీనం చేసుకునేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో రష్యా అధికారులు ఇప్పటికే రిఫరెండం నిర్వహించడం తెలిసిందే. జపోరిజియాలో 93 శాతం, ఖెర్సన్‌లో 87, లుహాన్స్‌క్‌లో 98, డొనెట్స్‌క్‌లో 99 శాతం విలీనానికి ఓటేసినట్టు వారు ప్రకటించారు. కాబట్టి ఆ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవాల్సిందిగా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను కోరనున్నట్టు బుధవారం చెప్పారు.

సైన్యంతో బెదిరించి బలవంతంగా విలీనానికి ఒప్పిస్తున్నట్టు విమర్శలు విన్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా బూటకమంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇప్పటికే తూర్పారబడుతున్నాయి. లక్షలాది బలగాలను ఉక్రెయిన్‌లోకి తరలిస్తామని పుతిన్‌ ప్రకటించడం, అణ్వాయుధాల ప్రయోగానికీ వెనుదీయబోమని హెచ్చరించడం తెలిసిందే. 
చదవండి: అమెరికా వీసాల వేగవంతానికి చర్యలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top