Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ జీవించేది మరో రెండేళ్లే!

Russia President Vladimir Putin Has Two Years To Live - Sakshi

మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్‌(69) ఆరోగ్యం నానాటికీ వేగంగా క్షీణిస్తోందని, ఆయన మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని ఉక్రెయిన్‌ నిఘా విభాగం అధికారి మేజర్‌ జనరల్‌ కైరిలో బుడానోవ్‌ వెల్లడించారు. తాను ఇటీవలే రష్యాలో రహస్యంగా పర్యటించానని, ఈ మేరకు కచ్చితమైన సమాచారం ఉందని చెప్పారు. పుతిన్‌ ఆరోగ్యంపై గత కొన్ని నెలలుగా రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలయ్యాక పుతిన్‌ తన మిలటరీ అధికారులతో తరచుగా సమావేశమవుతున్నారు. యుద్ధ వ్యూహాలు రచిస్తున్నారు. రష్యా విడుదల చేస్తున్న చిత్రాల్లో పుతిన్‌ అస్వస్థతతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల మాస్కోలో జరిగిన కార్యక్రమంలో పుతిన్‌ ఎక్కువసేపు నిలబడలేకపోయారు. మరో కార్యక్రమంలో నీరసంగా వెనుకా ముందు ఊగుతూ దర్శనమిచ్చారు.

బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు ఆయనకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. పుతిన్‌ కంటిచూపు కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. పార్కిన్సన్స్, స్కిచోఫ్రినియా లక్షణాలు సైతం ఉన్నాయని రష్యా వర్గాలు తెలియజేశాయి. పుతిన్‌ ఇప్పటికే క్యాన్సర్‌ బాధితుడు. గతంలో క్యాన్సర్‌ సర్జరీ జరిగినట్లు సమాచారం. ఆయనలో మళ్లీ తీవ్రమైన క్యాన్సర్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top