మార్చి 4న చైనా రాకెట్‌ చంద్రుడిని ఢీకొట్టనుం‍దా? డ్రాగన్‌ కంట్రీ ఏమంటోంది..

 Rocket Expected To Crash Far Side Of Moon On March 4 - Sakshi

Rocket To Crash Into Moon: బీజింగ్‌ చంద్రుని పై జరిపిన పరోశోధనల్లో భాగంగా చంద్రుని పైకి చైనాకి సంబంధించిన ఒక అంతరిక్ష వ్యర్థం వచ్చిందని నిపుణులు తెలిపారు. ఈ మేరకు మార్చి 4న చంద్రుడిని ఒక రాకెట్‌ ఢీకొట్టనుందని నిపుణులు వెల్లడించారు. తొలుత ఖగోళ శాస్త్రవేత్తలు అది స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌లోని భాగంగా భావించారు. కానీ అది ఏడేళ్ల క్రితం పేలిపోయిందని దాని మిషన్‌ పూర్తైయిన తర్వాత అంతరిక్షంలోకి వదిలివేయబడిందని నిర్ధారించారు.

కానీ ఇప్పుడూ చైనీస్‌ స్పేస్‌ ఏజెన్సీ చంద్ర అన్వేషణ కార్యక్రమంలో భాగంగా 2014లో Chang'e 5-T1 రాకెట్‌ని అంతరిక్షంలోకి పంపిందని కాబట్టి అది ఆ రాకెట్‌కి సంబంధించిన బూస్టర్‌ అని కొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఆ రాకెట్‌ మార్చి 4న చంద్రుని వైపు కూలిపోతుందని భావిస్తున్నారు. కానీ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఈ వాదనను ఖండించింది.

అంతేకాదు  మీరు అనుమానిస్తున్న ఆ బూస్టర్ భూ వాతావరణంలోకి సురక్షితంగా ప్రవేశించి కాలిపోయిందని పేర్కొంది. చైనా అంతరిక్ష సూపర్‌పవర్‌గా అవతరించడంపై దృష్టి సారించడమే కాక కొత్త అంతరిక్ష కేంద్రానికి సుదీర్ఘమైన సిబ్బందితో కూడిన మిషన్‌ను ప్రారంభించి ఒక ప్రభంజనం సృష్టించింది. అంతేగాక ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మిలిటరీ-రన్ స్పేస్ ప్రోగ్రామ్‌లో బిలియన్లను దున్నేసింది. చివరికి మానవులను చంద్రునిపైకి పంపాలని భావిస్తోంది కూడా.

(చదవండి: పుతిన్‌- బైడెన్‌ల అత్యవసర భేటీ!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top