చికెన్‌, పిజ్జా, వేడి ఆహారం కావాలంటూ ఖైదీల ఆందోళన.. జైలు గార్డును బంధించి.. | Prisoners Take 70-Year-Old Guard Hostage For Hours Demanding Pizza And Chicken - Sakshi
Sakshi News home page

చికెన్‌, పిజ్జా, వేడి ఆహారం కావాలంటూ ఖైదీల ఆందోళన.. జైలు గార్డును బంధించి..

Published Wed, Aug 23 2023 12:40 PM

Prisoners Take 70 Year Old Guard Demanding Pizza Chicken - Sakshi

జైలులోని ఖైదీలకు మంచి ఆహారం ఇవ్వరనే ఆరోపణలను వింటుంటాం. ఖైదీలు దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటారని కూడా చాలామంది చెబుతుంటారు. అయితే ఇటీవల మిచిగన్‌లోని ఒక జైలులో ఖైదీలకు అందించే ఆహారం విషయంలో ఆందోళన చెలరేగింది. ఇక్కడి సెయింట్‌ లూయీస్‌ ఫెసిలీటీలోని ఖైదీలు మంచి ఆహారం కోసం హడలెత్తించే పనిచేశారు. 

ఖైదీలంతా కలసి 70 ఏళ్ల గార్డును బంధించారు. తరువాత జరిగిన పరిణామాల అనంతరం ఆ గార్డుకు ఎటువంటి హాని తలపెట్టకుండా, మర్నాటి ఉదయం విడిచిపెట్టారు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు జైలును తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

ఈ జైలులో మొత్తం 700 మంది ఖైదీలు ఉన్నారు. వీరు తమకు ఆహారంలో చికెన్‌, పిజ్జాలు కావాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రతీరోజూ వేడి ఆహారం వడ్డించాలని కోరారు. వీటిని తక్షణం నెరవేర్చాలని కోరుతూ 70 ఏళ్ల గార్డును బంధించారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఈ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2021లో ఇక్కడి ఖైదీలు అల్లర్లకు పాల్పడి, జైలులోని కిటికీలను ధ్వంసం చేశారు. ఈ నేపపద్యంలో జైలు ఉన్నతాధికారి డేల్‌ గ్లాస్‌ రాజీనామా చేశారు. 
ఇది కూడా చదవండి: అడ్రస్‌ అడిగిన డెలివరీ బాయ్‌పై దాడి.. గంటపాటు మహిళ హైడ్రామా!

Advertisement
 
Advertisement