అమెరికాలో మొదలైన ఎన్నికల పోలింగ్ | Polling Start In America President Election | Sakshi
Sakshi News home page

అమెరికాలో మొదలైన ఎన్నికల పోలింగ్

Nov 3 2020 1:34 PM | Updated on Nov 3 2020 3:33 PM

Polling Start In America President Election - Sakshi

వాషింగ్టన్‌ : ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే అమెరికా  అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. భారత కాలమాన ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ మొదలైంది. న్యూ హాంప్‌షైర్‌లో తొలి ఓటు నమోదైంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ పోలింగ్‌ సాగుతోంది. అమెరికాలో మొత్తం 23.9 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌లో సగం ఓట్లు పోలైయ్యాయి. దాదాపు 10 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. హవాయ్‌, టెక్సాస్‌, మోంటానా రాష్ట్రాల్లో భారీగా ముందస్తు ఓట్లు పోలైయ్యాయి. ఈ పోస్టల్‌ ఓట్లపై రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి, అనుమానం వ్యక్తం చేశారు. (అమెరికా అధ్యక్ష ఎన్నికలు: నువ్వా.. నేనా?)

ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరుగుతోందని ఆరోపించారు. మరోవైపు ముందస్తు ఓటింగ్‌ భారీగా జరగడంతో విజయంపై బైడెన్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అమెరికన్‌ ఓటరు జాతీయవాదానికే మళ్లీ జై కొడతారా ? ట్రంప్‌ పాలనా వైఫల్యాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటారా ? అనేది వేచి చూడాలి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా, మాజీ ఉపాధ్యక్షుడు డెమొక్రాటిక్‌ అభ్యర్థిగా జో బైడెన్‌ బరిలో నిలిచారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement