Pakistan PM Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌కు ఘోర అవమానం.. పరువు పాయే

Perady Song Mocking Imran Khan Do Not Worry Refrain Is Going Viral - Sakshi

ఇమ్రాన్‌ ఖాన్‌ వైఫల్యాలను తెలుపుతూ పెరడీ పాట 

సెర్బియా పాకిస్తాన్‌ రాయబార కార్యాలయం ట్విటర్‌లో వీడియో

కాసేపటికే అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు గత మూడు నెలల నుంచి జీతాలు చెల్లించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పాక్‌, ఉగ్రవాదులకు అత్యంత సురక్షిత ప్రాంతంగా ప్రపంచదేశాల భావిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌ను ఆర్థికంగా ఆదుకోవడానికి ఏ దేశం ముందుకు రావడం లేదు. మరోవైపు డ్రాగన్‌ తన స్వార్థ ప్రయోజనాల కోసం పాక్‌కు రుణం ఇస్తోంది కానీ.. అవి ఆ దేశ అవసరాలను తీర్చడం లేదు. మరి కొన్ని నెలలు పరిస్థితి ఇలానే కొనసాగితే.. పాకిస్తాన్‌ ప్రభుత్వంలో భారీ మార్పుల చోటు చేసుకుంటాయి.

పాక్‌ ప్రభుత్వంపై సామాన్యులతో పాటు ప్రభుత్వ అధికారులకు కూడా పీకల్దాక కోపం ఉంది. ఈ క్రమంలో ఇమ్రాన్‌ ఖాన్‌ వైఫల్యాలను ఎండగడతూ రూపొందిచిన ఓ పెరడీ వీడియో పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఈ వీడియోను సెర్బియాలోని పాకిస్తాన్‌ రాయబార కార్యాలయం తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. 
(చదవండి: ఈ కడుపుమంట ఎందుకు?)

‘‘ద్రవ్యోల్బణంలో పాకిస్తాన్‌ గత రికార్డులను బద్దలు కొట్టింది. ఇమ్రాన్‌ ఖాన్‌.. మీరు ఇంకేత కాలం ప్రభుత్వ అధికారులు నోరు మెదపకుండా.. మీ కోసం పని చేయాలని ఆశిస్తున్నారు. గత మూడు నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఫీజు కట్టకపోవడంతో మా పిల్లలను పాఠశాల నుంచి బయటకు పంపిస్తున్నారు. ఇంకెంత కాలం మొద్దు నిద్ర నటిస్తారు.. ఇదేనా కొత్త పాకిస్తాన్‌’’ అనే క్యాప్షన్‌తో పెరడీ పాట వీడియోను షేర్‌ చేశారు. 

ఇక దీనిలో ఓ వ్యక్తి.. ‘‘సబ్బు ధర పెరిగిందా.. వాడకండి.. పిండి ఖరీదు ఎక్కువగా ఉందా.. తినకండి.. మందుల ధరలు పెరిగాయా.. అయితే ఆస్పత్రులకు వెళ్లకండి.. మీరు కేవలం పన్నుల చెల్లించి.. హాయిగా నిద్రపోండి. మీ పిల్లలకు తిండి, తిప్పలు, చదువు లేకపోయినా పర్వాలేదు. పాకిస్తాన్‌ ఎప్పటికి మేల్కొదు’’ అని సాగుతూ ఉంటుంది. ఇక ప్రతి వైఫల్యం దగ్గర ఇమ్రాన్‌ ఖాన్‌ గతంలో చెప్పిన డైలాడ్‌ ‘కంగారు పడకండి’ అని వస్తుంది. అంటే తిండి లేకపోయినా సరే కంగారు పడకండి అని సాగుతుంది ఈ పాట.
(చదవండి: ఇంటికి నిప్పు పెట్టి ఆర్పుతున్నట్లు నటన)

ఈ వీడియోని ట్విటర్‌లో షేర్‌ చేసిన కాసేపటికే ఇది తెగ వైరల​య్యింది. దాంతో అధికారుల స్పందించారు. ట్విటర్‌ నుంచి వీడియోని తొలగించారు. అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఆ తర్వాత పాక్ విదేశాంగ మంత్రిత్వ ‘‘సెర్బియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి చెందిన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ఈ ఖాతాలలో పోస్ట్ చేసిన సందేశాలు సెర్బియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుంచి వచ్చినవి కావు’’ అని ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ఉంది. 

చదవండి: కశ్మీర్‌ అంశంలో తాలిబన్ల సాయం తీసుకుంటాం: పాక్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top