కశ్మీర్‌ అంశంలో తాలిబన్ల సాయం తీసుకుంటాం: పాక్‌

Taliban Will Help Us Conquer Kashmir Says Pak PM Imran Khan Party Leader - Sakshi

వక్రబుద్ధిని బయటపెట్టిన పాకిస్తాన్‌

ఇస్లామాబాద్‌: జమ్ముకశ్మీర్‌ అంశంలో దాయాది దేశం పాకిస్తాన్‌ మ‌రోమారు త‌న వ‌క్ర‌బుద్దిని బ‌య‌ట‌పెట్టుకుంది. జ‌మ్ముక‌శ్మీర్ స‌మ‌స్యను ప‌రిష్క‌రించ‌డానికి తాలిబ‌న్ల సాయం తీసుకుంటామ‌ని ఆదేశ అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధికార ప్ర‌తినిధి నీలం ఇర్షాద్ షేక్ వెల్లడించారు. టీవీ చానెల్‌లో జ‌రిగిన చ‌ర్చ‌లో ఈ విషయాన్ని ప్ర‌క‌టించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. 

టీవీ చర్చలో క‌శ్మీర్ అంశంపై పాకిస్తాన్‌తో చేతులు క‌లుపుతామ‌ని తాలిబ‌న్లు ప్ర‌క‌టించార‌ని నీలం ఇర్షాద్ షేక్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో పాకిస్తాన్ సైన్యానికి, తాలిబ‌న్ల‌కు ఉన్న స‌న్నిహిత సంబంధాలు బ‌హిర్గ‌తం అయ్యాయి. పీటీఐ అధికార ప్ర‌తినిధి నోటి నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడగానే అప్ర‌మ‌త్త‌మైన చానెల్ న్యూస్ యాంక‌ర్‌.. ‘‘ఈ షో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌సారం అవుతుంది. భార‌తీయులు కూడా వీక్షిస్తున్నారు. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా.. మీరేం చెప్పారో మీకు అర్థం అవుతుందా’’ అని నీలం ఇర్షాద్ షేక్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. కానీ అతడు ఇవేవి పట్టించుకోకుండా.. ‘‘తాలిబన్లు మాకు సాయం చేస్తారు.. ఎందుకంటే వారిని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు’’ అంటూ కొనసాగించాడు.
(చదవండి: పాకిస్తాన్‌ వల్లే తాలిబన్లు ఇలా.. భారత్‌ మా ఫ్రెండ్‌: పాప్‌ స్టార్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top