Sakshi News home page

పబ్జీ ప్రేమ.. ప్రియుడి కోసం నలుగురు పిల్లలతో పాక్‌ నుంచి భారత్‌కు.. చివరికి!

Published Tue, Jul 4 2023 10:04 AM

Pak Woman Meets Noida Man  With Kids While Playing PUBG - Sakshi

స్మార్ట్‌ ఫోన్లలో ఆన్‌లైన్‌ గేమ్‌లు పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ గేమ్‌లకు అడిక్ట్‌ అవుతున్నారు. చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు ప్రపంచాన్ని మరిచిపోయి అందులో లీనమవుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా కొంతమంది ప్రాణాలు తీసుకునే వరకు వెళుతుంది. భారత్‌లో పబ్జీ వంటి గేమ్‌లను నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయిన పలువురు ఇతర మార్గాల ద్వారా గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఆడుతున్నారు.

తాజాగా పబ్జీ గేమ్‌ ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. పబ్జీలో పరిచమైన యువకుడి కోసం ఓ మహిళ తన పిల్లలతో కలిసి భర్తను వదిలేసి వచ్చింది. ‍ఆన్‌లైన్‌ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రయాణమైంది. ఈ వింత ఘటన నోయిడాలో చేసుకుంది. 

నోయిడాకు చెందిన యువకుడు సచిన్‌కు పాకిస్థాన్‌కు చెందిన మహిళ సీమా గులామ్‌ హైదర్‌తో పబ్జీ ద్వారా పరిచయం ఏర్పడింది.  అప్పటికే మహిళకు వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. పబ్జీలో సీమా, సచిన్‌ రోజు చాటింగ్‌ చేసుకునేవారు. ఇలా వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో ప్రియుడు కోసం కట్టుకున్న భర్తను విడిచిపెట్టేందుకు సిద్ధంమైంది.

ఈ క్రమంలో గత నెల నేపాల్‌ మీదుగా తన నలుగురు పిల్లలతో ఉత్తర ప్రదేశ్‌ చేరుకుంది. అటు నుంచి బస్‌లో గ్రేటర్‌ నోయిడాకు వచ్చి తన ప్రియుడిని కలుసుకుంది. మహిళ, తన పిల్లలతో కలిసి  సదరు యువకుడు రబుపెర ప్రాంతంలో  అద్దె ఇంట్లో జీవించడం ప్రారంభించారు.

అయితే పాకిస్తాన్‌ మహిళ నోయిడా అక్రమంగా నివసిస్తుందని స్థానిక పోలీసులకు సమాచారం అందింది. సీమా సంగతి పోలీసులకు పసిగట్టారన్న విషయం తెలుసుకున్న సచిన్‌ ఆమెతోపాటు పారిపోయాడు.

ఎట్టకేలకు నోయిడా అక్రమంగా నివసిస్తున్న సీమా, తన పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఆశ్రయం కల్పించిన నోయిడా యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాకిస్తాన్‌ మహిళ, నలుగురు పిల్లలు, నోయిడా యువకుడి పోలీస్‌ కస్టడీలో ఉన్నట్లు నోయిడా డీసీపీ సాద్‌ మియా ఖాన్‌ పేర్కొన్నారు. ఇద్దరిని విచారిస్తున్నట్లు తెలిపారు.

మే నెలలో ఇంటిని అద్దెకు తీసుకున్నారని, తమకు కోర్టు వివాహం జరిగిందని, నలుగురు పిల్లలున్నారని చెప్పినట్లు వారు నివసించిన అపార్ట్‌మెంట్ యజమాని బ్రిజేష్ పోలీసులకు తెలిపాడు. సదరు మహిళ పాకిస్తాన్‌కు చెందినామెలా కనిపించలేదని, ఆమె సల్వార్‌ సూట్‌, చీరలుధరించేదని యజమాని పోలీసులకు చెప్పాడు.

Advertisement

What’s your opinion

Advertisement