North Korea Military Parade: నార్త్‌ కొరియా కిమ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

North Korea Military Parade Displays Ballistic Missiles In Pyongyang - Sakshi

సియోల్‌: అమెరికా సహా అంతర్జాతీయ ఒత్తిడిని బేఖాతరు చేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఘాటైన హెచ్చరికలు చేశారు. ఎవరైనా తమను రెచ్చగొడితే అణు దాడికి సిద్ధమేనని తేల్చి చెప్పారు. అణ్వాయుధ సంపత్తిని మరింతగా పెంచుకుంటామని ప్రతినబూనారు.

ఉత్తర కొరియా ఆర్మీ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి ఆయుధాల పరేడ్‌ నిర్వహించారు. ఈ ఆయుధ ప్రదర్శనలో దేశానికి చెందిన అత్యంత శక్తిమంతమైన, ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను ప్రదర్శించారు. సైనిక దుస్తులైన తెలుపు రంగు కోటు వేసుకున్న కిమ్‌ భార్య రి సోల్‌ జూతో కలిసి పరేడ్‌ని తిలకించారు.

 ‘‘యుద్ధాన్ని అరికట్టడమే మా మొదటి లక్ష్యం అయినప్పటికీ, మా దేశ ప్రయోజనాలకు ఎవరైనా భంగం కలగజేస్తే అణ్వాయుధాలతో ఎదురు దాడి చేయడం మా రెండో లక్ష్యమవుతుంది’’అని కిమ్‌ కుండబద్దలు కొట్టారు. ఈ ఆయుధ పరేడ్‌లో ఉత్తర కొరియాకి చెందిన అతి పెద్ద ఖండాంతర క్షిపణి హ్వాసాంగ్‌–17 ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్షిపణి పరిధిలో అమెరికా అంతా ఉందని వార్తలొచ్చాయి.      

 ఇది కూడా చదవండిఅగ్నికి ఆజ్యం పోస్తున్నారు.. రష్యా వార్నింగ్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top