ఉత్తరకొరియా మళ్లీ అణ్వస్త్ర డ్రోన్‌ పరీక్ష | North Korea claims to test underwater nuclear attack drone | Sakshi
Sakshi News home page

ఉత్తరకొరియా మళ్లీ అణ్వస్త్ర డ్రోన్‌ పరీక్ష

Apr 9 2023 4:05 AM | Updated on Apr 9 2023 5:10 AM

North Korea claims to test underwater nuclear attack drone - Sakshi

సియోల్‌: అణుధార్మిక సునామీని సృష్టించగల అండర్‌వాటర్‌ డ్రోన్‌ను మరోసారి విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా తెలిపింది. ఈ కొత్త రకం డ్రోన్‌ హెయిల్‌–2ను శుక్రవారం తీర నగరం టంచోన్‌ వద్ద సుముద్ర జలాల్లో ప్రయోగించినట్లు వెల్లడించింది.

నీటి అడుగున ఇది 71 గంటలకు పైగా ప్రయాణించి నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని తెలిపింది. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను హెయిల్‌–2 తుత్తునియలు చేయగలదని అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement