breaking news
Nuclear explosion
-
ఉత్తరకొరియా మళ్లీ అణ్వస్త్ర డ్రోన్ పరీక్ష
సియోల్: అణుధార్మిక సునామీని సృష్టించగల అండర్‌వాటర్ డ్రోన్‌ను మరోసారి విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా తెలిపింది. ఈ కొత్త రకం డ్రోన్ హెయిల్–2ను శుక్రవారం తీర నగరం టంచోన్ వద్ద సుముద్ర జలాల్లో ప్రయోగించినట్లు వెల్లడించింది. నీటి అడుగున ఇది 71 గంటలకు పైగా ప్రయాణించి నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని తెలిపింది. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను హెయిల్–2 తుత్తునియలు చేయగలదని అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది. -
‘అమెరికాను బూడిదగా మార్చే శక్తి రష్యాకే ఉంది’
మాస్కో: అమెరికాను అణుధార్మిక భస్మంగా మార్చే శక్తి ఒక్క రష్యాకు మాత్రమే ఉందని.. రష్యా ప్రభుత్వ టీవీ చానల్లో న్యూస్ యాంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే రోస్సియా 1 టీవీ చానల్లో దిమిత్రీ కీసెల్యేవ్ అనే యాంకర్ వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుపడ్డారు. ఆదివారం ఒక చర్చా కార్యక్రమంలో.. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో పుతిన్ అధ్యక్షుడిగా ఉన్న రష్యాను చూసి అమెరికా, ఆ దేశాధ్యక్షుడు ఒబామా భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఒబామా కన్నా పుతిన్ బలవంతుడైన నాయకుడని అమెరికన్లు సైతం పరిగణిస్తున్నారని ఒక సర్వేను ఉటంకిస్తూ పేర్కొన్నారు. టీవీ చానల్ నేపథ్యంలో అణ్వస్త్ర విస్ఫోటనం దృశ్యాన్ని చూపుతూ.. అమెరికాను అణుధార్మిక బూడిదగా మార్చే శక్తి ఒక్క రష్యాకే ఉందన్నారు.