‘అమెరికాను బూడిదగా మార్చే శక్తి రష్యాకే ఉంది’ | As you know, the power to alter the Russia | Sakshi
Sakshi News home page

‘అమెరికాను బూడిదగా మార్చే శక్తి రష్యాకే ఉంది’

Mar 18 2014 1:59 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాను అణుధార్మిక భస్మంగా మార్చే శక్తి ఒక్క రష్యాకు మాత్రమే ఉందని.. రష్యా ప్రభుత్వ టీవీ చానల్‌లో న్యూస్ యాంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 మాస్కో: అమెరికాను అణుధార్మిక భస్మంగా మార్చే శక్తి ఒక్క రష్యాకు మాత్రమే ఉందని.. రష్యా ప్రభుత్వ టీవీ చానల్‌లో న్యూస్ యాంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే రోస్సియా 1 టీవీ చానల్‌లో దిమిత్రీ కీసెల్యేవ్ అనే యాంకర్ వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుపడ్డారు.

 

ఆదివారం ఒక చర్చా కార్యక్రమంలో.. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో పుతిన్ అధ్యక్షుడిగా ఉన్న రష్యాను చూసి అమెరికా, ఆ దేశాధ్యక్షుడు ఒబామా భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఒబామా కన్నా పుతిన్ బలవంతుడైన నాయకుడని అమెరికన్లు సైతం పరిగణిస్తున్నారని ఒక సర్వేను ఉటంకిస్తూ పేర్కొన్నారు. టీవీ చానల్ నేపథ్యంలో అణ్వస్త్ర విస్ఫోటనం దృశ్యాన్ని చూపుతూ.. అమెరికాను అణుధార్మిక బూడిదగా మార్చే శక్తి ఒక్క రష్యాకే ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement