ఏమైందో తెలియదు..! నడిరోడ్డుపై క్యాబ్‌ డ్రైవర్‌ని చితక్కొట్టారు.. వీడియో వైరల్‌..

New York Taxi Driver Brutally Beaten By Youth After Argument - Sakshi

అమెరికాలోని న్యూయార్క్‌లో దారుణం జరిగింది. ఐదుగురు యువకులు కలిసి వృద్ధుడైన ఓ క్యాబ్ డ్రైవర్‌ను దారుణంగా కొట్టారు. నడిరోడ్డులో 60 ఏళ్ల వృద్ధునిపై విచక్షణా రహితంగా పిడిగుద్దులు కురిపించారు. బూటు కాలుతో తంతూ ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులు కలిసి దాడి చేశారు.  నగరంలోని సిక్స్త్ అవెన్యూ 34 వ కూడలికి సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కాగా.. నెటిజన్లు ఫైరవుతున్నారు. 

వీడియో ప్రకారం ఐదుగురు కలిసి క్యాబ్ డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. వారి దెబ్బలను తట్టుకోలేక ఆ వృద్ధుడు తనను తాను రక్షించుకోవడానికి తలపై చేతులు పెట్టుకుని దీనంగా నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఓ మహిళ పిడిగుద్దులను భరించలేక క్యాబ్‌ వైపు వంగి పడిపోయాడు. ఈ దృశ్యాలు సదరు వీక్షకున్ని ఆలోచింపజేశాయి. ఈ వీడియో వైరల్‌ కాగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట క్యాబ్ డ్రైవర్‌కు యువకులకు మధ్య వాగ్వాదం నడిచిందని తెలిపారు. అనంతరం దాడి జరిగినట్లు పేర్కొన్నారు. 

తీవ్రంగా గాయపడిన వృద్ధున్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. హోవార్డ్ కొలీ, నటాలీ మోర్గాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ బ్రూక్లిన్‌కు చెందినవారిగా గుర్తించారు.

ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top