
కాలిఫోర్నియా: అమెరికాలో భారీ సెమీ – ట్రక్ నడుపుతున్న హర్జిందర్ సింగ్ అనే భారతీయుడు అక్రమంగా యూ-టర్న్ తీసుకుని, ముగ్గురి మృతికి కారకునిగా మారడం ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్- కాలిఫోర్నియా గవర్నర్ మధ్య వివాదాలకు కారణంగా నిలిచింది. ఫ్లోరిడా టర్న్‌పైక్ పై జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హర్జిందర్ సింగ్ అక్రమంగా యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఒక కారు ఆ ట్రక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
Three innocent people were killed in Florida because Gavin Newsom’s California DMV issued an illegal alien a Commercial Driver’s License—this state of governance is asinine.
How many more innocent people have to die before Gavin Newsom stops playing games with the safety of the… https://t.co/QrEMOsDnIL— Homeland Security (@DHSgov) August 18, 2025
ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారులు ఈ ప్రమాదాన్ని సాధారణ రోడ్డు యాక్సిడెంట్ మాదిరిగా కాకుండా, హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ కేసుగా నమోదు చేశారు. అంటే చట్టవిరుద్ధ డ్రైవింగ్ కారణంగా ఇతరుల ప్రాణాలు పోయాయని భావిస్తూ డ్రైవర్ పై కేసు నమోదు చేయడం. కాగా అమెరికాలో అక్రమంగా 2018 నుంచి ఉంటున్న హర్జిందర్ సింగ్ కాలికాలిఫోర్నియా స్టేట్ నుంచి కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అక్రమ వలసదారు హర్జిందర్ సింగ్ లైసెన్స్ ఎలా పొందాడనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హైవే సేఫ్టీ అండ్ మోటార్ వెహికల్స్ డైరెక్టర్ డేవ్ కర్నర్ మాట్లాడుతూ.. హర్జిందర్ సింగ్ నేరపూరిత చర్యల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అతను ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు. చట్టాల ప్రకారం హత్య కేసును ఎదుర్కోనున్నాడు. అలాగే ఇమిగ్రేషన్ ఉల్లంఘన కేసునూ ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు.
భారతదేశానికి చెందిన హర్జిందర్ సింగ్ చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటునప్పటికీ కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్ (డీఎంవీ) వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసిందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ‘ఎక్స్’లో తెలియజేసింది. ఇందుకు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ కారణమని ఆరోపించింది. అతను అమెరికన్ ప్రజల భద్రతతో ఆటలాడుకుంటున్నాడని పేర్కొంది. తమ సంస్థ ఇటువంటి నేరస్తులైన అక్రమ వలసదారులను అమెరికా నుండి బయటకు పంపేందుకు 24 గంటలూ పనిచేస్తున్నదని డీహెచ్‌ఎస్ పేర్కొంది.
.@grok, who was President in 2018? pic.twitter.com/51mbnoaghX
— Governor Newsom Press Office (@GovPressOffice) August 17, 2025
అయితే దీనికి కౌంటర్‌గా గవర్నర్ న్యూసమ్ ప్రెస్ ఆఫీస్ హర్జిందర్ సింగ్ యూఎస్‌లోకి ప్రవేశించిన సమయంలో ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నారని పేర్కొంది. కాలిఫోర్నియా చట్టం ప్రకారం దేశంలో చట్టబద్ధమైన ఉనికి ఉన్నప్పుడే వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ పొందుతారని తెలిపింది. సింగ్ 2018 సెప్టెంబర్‌లో కాలిఫోర్నియా సరిహద్దును అక్రమంగా దాటారని, అప్పుడు బోర్డర్ పెట్రోల్ అరెస్టు చేసిందని వివరించింది. ఆ తర్వాత సింగ్‌ను ఫాస్ట్-ట్రాక్ డిపోర్టేషన్ కోసం ప్రాసెస్ చేశారని తెలిపింది. ఆ తర్వాత 2019, జనవరిలో నోటీసు టు అప్పీర్ ఇచ్చిన తర్వాత ఆయనను ఐదువేల అమెరికన్ డాలర్ల ఇమ్మిగ్రేషన్ బాండ్‌పై విడుదల చేశారని, అప్పటి నుండి హర్జిందర్ సింగ్‌ఇమ్మిగ్రేషన్ ప్రక్రియల్లోనే ఉన్నాడని న్యూసమ్ ప్రెస్ వివరించింది.