
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డు పొందాలంటే దరఖాస్తుదారులు చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇలాంటి వారికి ఊరట కలి్పస్తూ ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డు(ఈఏడీ) అందజేయాలని వైట్‌హౌస్ కమిషనర్ గురువారం ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్సు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆమోద ముద్ర వేస్తే ఈఏడీ మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనివల్ల లక్షలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుంది.