వైరల్‌: బంజారా పాట.. అదిరిపోయే స్టెప్పులతో రష్యన్ల ఆట!

Netizens Were Amazed By Russians Dance On Bhangra Punjabi Song - Sakshi

మాస్కో: కళకు సరిహద్దులు, భాషా బేధం లేదు. ఆ కళలలో సంగీతం కూడా ఒకటి. అలాగే భారతీయ సంగీతంలో ఓ మాయాజాలం ఉంది. పాట సాహిత్యాన్ని అర్థ చేసుకోకపోయినా.. భారతీయ పాటల బీట్స్‌కి ఎవరైనా కాలు కదపవచ్చు. అయితే తాజాగా ఓ రష్యన్‌ల బృందం పంజాబీలో  ‘‘ముండియన్‌ తు బాచ్‌ కే’’ అనే ప్రసిద్థ పాటకు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

డ్యాన్స్‌ గ్రూపులోని పురుషులు, మహిళలు భారతీయ వేషధారణలో ఉన్నారు. మహిళలు ఎరుపు లెహోంగా-చోలి ధరించగా.. పురుషులు కుర్తా-పైజామా ధరించి, సరియైన భావ వ్యక్తీకరణలతో నృత్యం చేస్తున్నారు.  కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారి నాట్యానికి, నటనకు ఫిదా అవుతున్నారు. వందలాది మంది అభినందనలు తెలుపుతున్నారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘కళకు సరిహద్దులు లేవు.. మీ డ్యాన్స్‌కి నేను ఫిదా!’’ అంటూ కామెంట్‌ చేశారు. ఇక మరో నెటిజన్‌ ‘‘ భారతీయ సంస్కృతిలో 64 కళలు.. ఆ కళలలో సంగీతం కూడా ఒకటి. మీ నృత్య ప్రదర్శన భలే ఉంది.’’ అని రాసుకొచ్చారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top