bhangra
-
బంజారా పాట.. అదిరిపోయే స్టెప్పులతో రష్యన్ల ఆట!
మాస్కో: కళకు సరిహద్దులు, భాషా బేధం లేదు. ఆ కళలలో సంగీతం కూడా ఒకటి. అలాగే భారతీయ సంగీతంలో ఓ మాయాజాలం ఉంది. పాట సాహిత్యాన్ని అర్థ చేసుకోకపోయినా.. భారతీయ పాటల బీట్స్‌కి ఎవరైనా కాలు కదపవచ్చు. అయితే తాజాగా ఓ రష్యన్ల బృందం పంజాబీలో ‘‘ముండియన్ తు బాచ్ కే’’ అనే ప్రసిద్థ పాటకు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. డ్యాన్స్ గ్రూపులోని పురుషులు, మహిళలు భారతీయ వేషధారణలో ఉన్నారు. మహిళలు ఎరుపు లెహోంగా-చోలి ధరించగా.. పురుషులు కుర్తా-పైజామా ధరించి, సరియైన భావ వ్యక్తీకరణలతో నృత్యం చేస్తున్నారు. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారి నాట్యానికి, నటనకు ఫిదా అవుతున్నారు. వందలాది మంది అభినందనలు తెలుపుతున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘కళకు సరిహద్దులు లేవు.. మీ డ్యాన్స్‌కి నేను ఫిదా!’’ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ ‘‘ భారతీయ సంస్కృతిలో 64 కళలు.. ఆ కళలలో సంగీతం కూడా ఒకటి. మీ నృత్య ప్రదర్శన భలే ఉంది.’’ అని రాసుకొచ్చారు. #Russians and #Bhangra beats. pic.twitter.com/fb4lqFgPSn — Rupin Sharma IPS (@rupin1992) July 6, 2021 -
'కెనడా' మేయర్ ఇండియన్ డ్యాన్స్ అదుర్స్
-
'కెనడా' మేయర్ ఇండియన్ డ్యాన్స్ అదుర్స్
కెనడా: నెట్ ఇంట్లో ఓ కెనడియన్ మేయర్ హల్ చల్ చేస్తున్నాడు. భారత సిక్కు సంప్రదాయాన్ని చూసి ముచ్చట పడటమే కాకుండా సిక్కులు కట్టుకునే టర్బన్ ధరించి అదిరిపోయే భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. గతంలో కెనడాకు చెందిన ప్రధాని జస్టిన్ ట్రూడూ కూడా ఇలాగే చేసి ఆన్లైన్లో అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు తాను కూడా ఏం తక్కువకానని వైట్ హార్స్ మేయర్ డాన్ కర్టిస్ నిరూపించాడు. కెనడాలో పుట్టి అక్కడే పెరిగిన ఆయనకు సిక్కుల టర్బన్‌పై ఆసక్తి ఏర్పడింది. ఇందులో భాగంగా ఫందేర్ సింగ్ అనే వ్యక్తిని పిలిపించుకున్నాడు. ఆయన ప్రముఖ రచయిత పైగా మంచి డ్యాన్సర్ కూడా. దీంతో ఆయనను సిటీ కౌన్సిల్ చాంబర్‌కు పిలిపించుకొని ప్రత్యేకంగా ఓ వీడియోగ్రాఫర్‌ను ఏర్పాటుచేయగా టర్బన్ కట్టుకోవడం ఎలాగో ఫందేర్ నేర్పించాడు. స్వయంగా ఆ మేయర్‌కు టర్బన్ చుట్టాడు. అనంతరం ఇద్దరు కలిసి దుమ్ములేపేలా భాంగ్రా స్టెప్పులేశారు. ఈ వీడియో దాదాపు ఆరు నిమిషాలపాటు ఉంది. -
భాంగ్రా బీట్ కు కెనడా ప్రధాని స్టెప్పులు..!
ప్రజల మనిషిగా పేరొంది... కెనడా దేశానికి కొత్తగా ఎన్నికైన ప్రధాని జస్టిన్ ట్రూడో భాంగ్రా డ్యాన్సుతో వీక్షకుల మనసు దోచుకున్నారు. ప్రధాని హోదాలోనూ ఆయన సాధారణ వ్యక్తిగా కలసిపోయారు. సంప్రదాయ కుర్తా పైజమా ధరించి, డ్చాన్స్ ఫ్లోర్ పై నృత్యకారిణులతో పదం కలిపారు. పంజాబీ జానపద నృత్యంగా పేరొందిన భాంగ్రా డ్యాన్స్ కు లయబద్ధంగా స్టెప్పులు వేసి అందర్నీ, విస్మయానికి, ఆశ్చర్యానికి గురిచేశారు. ఇండియన్ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మాంట్రియల్ ఈవెంట్ లో 43 ఏళ్ల గ్రూవింగ్ ఓ పంజాబీ పాటకు చేసిన డ్యాన్స్.. యూట్యూబ్ లో విడుదలైంది. వేదికపై జరుగుతున్న నృత్య కార్యక్రమంలో భాగంగా ఓ మహిళతో కలసి ట్రూడో.. పాటకు అనుగుణంగా పదాలు కలుపుతూ తానూ ఓ ఏస్ డ్యాన్సర్ అని నిరూపించుకున్నారు. ట్రూడో చూపించిన ఉత్సాహానికి అక్కడివారంతా ముగ్ధులయ్యారు. వారంతా ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చి ఆయనతో పాటు డ్యాన్స్ లో పాలుపంచుకున్నారు. అక్టోబర్ 19న ఓ కొత్త అధ్యాయానికి తెరలేపి.. 43 ఏళ్ల వయసులోనే ప్రధాని అయిన రెండో వ్యక్తి ట్రూడో. ఈ సందర్భంగా ఆయన తనకు మద్దతు ఇచ్చినవారికి వారికి కృతజ్ఞతలు తెలిపారు.అదేరోజు మాట్రియల్లో జర్రీ సబ్వే స్టేషన్ సందర్శించిన ఆయన అక్కడికి వచ్చిన వారందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి.. వారితో కలసి ఉత్సాహంగా తీసుకున్న సెల్ఫీలను ఓ వెబ్ సైట్ పోస్ట్ చేసింది. 1968 నుంచి 1979 వరకు, తిరిగి 1980 నుంచి 1984 వరకు కెనడా ప్రధానిగా ఉన్న.. కెనడా మాజీ ప్రధాని పియర్ ట్రుడో కుమారుడే.. ఈ ప్రజా వ్యక్తి జస్టిన్ ట్రుడో.