'కెనడా' మేయర్‌ ఇండియన్‌ డ్యాన్స్‌ అదుర్స్ | canadian mayor wears turban, does the bhangra In video viral | Sakshi
Sakshi News home page

'కెనడా' మేయర్‌ ఇండియన్‌ డ్యాన్స్‌ అదుర్స్

Jan 13 2017 1:53 PM | Updated on Sep 5 2017 1:11 AM

'కెనడా' మేయర్‌ ఇండియన్‌ డ్యాన్స్‌ అదుర్స్

'కెనడా' మేయర్‌ ఇండియన్‌ డ్యాన్స్‌ అదుర్స్

నెట్‌ ఇంట్లో ఓ కెనడియన్‌ మేయర్‌ హల్‌ చల్‌ చేస్తున్నాడు. భారత సిక్కు సంప్రదాయాన్ని చూసి ముచ్చట పడటమే కాకుండా సిక్కులు కట్టుకునే టర్బన్‌ ధరించి అదిరిపోయే భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టాడు.

కెనడా: నెట్‌ ఇంట్లో ఓ కెనడియన్‌ మేయర్‌ హల్‌ చల్‌ చేస్తున్నాడు. భారత సిక్కు సంప్రదాయాన్ని చూసి ముచ్చట పడటమే కాకుండా సిక్కులు కట్టుకునే టర్బన్‌ ధరించి అదిరిపోయే భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అవుతోంది. గతంలో కెనడాకు చెందిన ప్రధాని జస్టిన్‌ ట్రూడూ కూడా ఇలాగే చేసి ఆన్‌లైన్‌లో అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు తాను కూడా ఏం తక్కువకానని వైట్‌ హార్స్‌ మేయర్‌ డాన్‌ కర్టిస్‌ నిరూపించాడు.

కెనడాలో పుట్టి అక్కడే పెరిగిన ఆయనకు సిక్కుల టర్బన్‌పై ఆసక్తి ఏర్పడింది. ఇందులో భాగంగా ఫందేర్‌ సింగ్‌ అనే వ్యక్తిని పిలిపించుకున్నాడు. ఆయన ప్రముఖ రచయిత పైగా మంచి డ్యాన్సర్‌ కూడా. దీంతో ఆయనను సిటీ కౌన్సిల్‌ చాంబర్‌కు పిలిపించుకొని ప్రత్యేకంగా ఓ వీడియోగ్రాఫర్‌ను ఏర్పాటుచేయగా టర్బన్‌ కట్టుకోవడం ఎలాగో ఫందేర్‌ నేర్పించాడు. స్వయంగా ఆ మేయర్‌కు టర్బన్‌ చుట్టాడు. అనంతరం ఇద్దరు కలిసి దుమ్ములేపేలా భాంగ్రా స్టెప్పులేశారు. ఈ వీడియో దాదాపు ఆరు నిమిషాలపాటు ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement