సీకే లావణ్యకు షాక్‌! | TDP Leaders Fight In Chittoor Mayor Post | Sakshi
Sakshi News home page

సీకే లావణ్యకు షాక్‌!

Oct 17 2026 8:19 AM | Updated on Oct 17 2026 8:19 AM

TDP Leaders Fight In Chittoor Mayor Post

సాక్షి, చిత్తూరు : చిత్తూరు మేయర్‌ కుర్చీపై టీడీపీలో కుమ్ములాట మొదలైంది. బీసీ–జనరల్‌కు రిజర్వు చేయబడిన మేయర్‌ స్థానంపై 24 గంటల ముందు వరకు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సతీమణి లావణ్య పేరు జోరుగా వినిపించింది. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌కాల్స్‌ సర్వేలో లావణ్య పేరు రాకపోవడంతో ఒక్కసారిగా సీకే కుటుంబం షాక్‌కు గురైంది. ఇదే సమయంలో ఐవీఆర్‌ఎస్‌లో త్యాగరాజన్, కాజూరు బాలాజీ, కటారి హేమలత పేర్లు వచ్చాయి.

 తాజాగా శుక్రవారం సాయంత్రం మేయర్‌ టికెట్‌ను టీడీపీ నుంచి కటారి హేమలతకు ఖరారైనట్లు ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యే కార్యాలయంలో ఆశావహులు ఉండగానే అధిష్టానం నుంచి హేమలత పేరు ఖరారైనట్లు సమాచారం. దీంతో మనస్తాపానాకి గురై న కాజూరు బాలాజీ అక్కడి నుంచి విసురుగా వచ్చేశారు. అనంతరం తన అనుచరులతో సమావేశమయ్యారు. శనివారం తన భార్య దాక్షాయణితో నామినేషన్‌ వేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అనుచరులు, టీడీపీ కార్యకర్తలు తరలిరావాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

 శనివారం కటారి హేమలత కూడా మేయర్‌ స్థానానికి నామినేషన్‌ దాఖ లు చేయడానికి సిద్ధమవుతున్నారు.  సీకే బాబు కుటుంబానికి టీడీపీ అధిష్టానం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అయోమయంలో ఉన్నారు. అయితే జెడ్పీ చైర్‌పర్సన్‌ అవకాశం సీకే కుటుంబానికి రావొచ్చని, తవణంపల్లె జెడ్పీటీసీగా పోటీ చేస్తారని, చుడా చైర్‌పర్సన్‌ ఇస్తారనే ఊహాగానా లు వినిపిస్తున్నాయి. కానీ, మేయర్‌ అభ్యర్థిత్వం మినహా మరేదీ వద్దని సీకే కుటుంబం గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చిత్తూరు మేయ ర్‌ టికెట్‌ టీడీపీలో కుంపటిని రాజేసింది.    a

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement