సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా డా. ముక్క శ్రావణి పేరును ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేశారు.
మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లలో చిత్తూరుకు కటారి హేమలత, కడపకు డా. నెల్లటూరి సువర్ణ, కర్నూలుకు విజయ ప్రత్యూష, నెల్లూరుకు పోలుబోయిన రూప్కుమార్, తిరుపతికి మన్నెం శ్రీనివాస ప్రసాద్, విజయనగరానికి అవనపు భార్గవి పేర్లను ఖరారు చేశారు.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో..
ఆళ్లగడ్డ నుంచి అనీషా షేక్, అద్దంకి నుంచి కాకాని అశోక్, ఆదోని నుంచి నాగమణి, ఆత్మకూరు (నంద్యాల) నుంచి డా. గోవిందరాజులు, బద్వేలు నుంచి సోమశిల దివ్య తేజ, బొబ్బిలి నుంచి రాంబార్కి రేణుకాదేవి స్వప్నను ఎంపిక చేశారు. దాచేపల్లికి తంగెళ్ల శ్రీనివాసరావు, ధర్మవరానికి పరిశె సుధాకర్, గురజాలకు నెలవల్లి బొల్లయ్య, హిందూపురానికి పీఎస్ మంజునాథ్, ఇచ్ఛాపురానికి ఆసి లీలారాణి, జగ్గయ్యపేటకు నరేంద్రుల వినీత పేర్లు ఖరారయ్యాయి. జమ్మలమడుగు నుంచి జ్యోతి చదిపిరాల, కమలాపురం నుంచి గొంగలిరెడ్డి స్వప్న, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ఎస్. రాజకుమార్, మాచర్ల నుంచి ఎనుముల సుష్మ, మదనపల్లె నుంచి శ్రీరామ్ చిన్నబాబు, మార్కాపురం నుంచి వక్కలగడ్డ మల్లికార్జున బరిలో నిలవనున్నారు.
నగరికి శ్రీనివాసన్, పలాస–కాశీబుగ్గకు వజ్జ గంగాభవాని, పెద్దాపురానికి వత్సవాయి ఎల్ఎస్ఎన్ రాజు, పెనుకొండకు త్రివేంద్రమూర్తి ఎంపికయ్యారు. పులివెందులకు తుగుట్ల గీతాకుమారి, రాజంపేటకు డా. దొంతం గాయత్రి, రామచంద్రపురానికి మేడిశెట్టి శేషారావు, రాయచోటికి ఖాదర్వలి షేక్, రాయదుర్గానికి టంకశాల హనుమంతు, రేపల్లెకు కె. అపర్ణ, సూళ్లూరుపేటకు పిట్టల సుహాసిని పేర్లను ప్రకటించారు.


