నేపాల్‌లో మరో మాజీ ప్రధాని అరెస్ట్‌కు రంగం సిద్ధం | Nepal Issues Arrest Warrant For Former Pm Deuba In Graft Probe | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో మరో మాజీ ప్రధాని అరెస్ట్‌కు రంగం సిద్ధం

Apr 9 2026 3:33 PM | Updated on Apr 9 2026 3:45 PM

Nepal Issues Arrest Warrant For Former Pm Deuba In Graft Probe

ఖాట్మండు: నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరో మాజీ ప్రధాని అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నేత షేర్ బహదూర్ దేవుబాపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఆయన భార్య, మాజీ విదేశాంగ మంత్రి ఆర్జూ రాణా దేవుబాపై కూడా వారెంట్‌ను ప్రభుత్వం జారీ చేసింది.

కాగా, నేపాల్‌లో ఇటీవలే బాలేంద్ర షా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగా.., నేపాల్‌ నూతన ప్రధానిగా బాలెంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మరుటి రోజే కె.పి.శర్మ ఓలీ అరెస్టు అయిన సంగతి తెలిసిందే.  గత ఏడాది జెన్‌ జెడ్‌ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేశారంటూ కె.పి.శర్మ ఓలీపై అభియోగాలు నమోదయ్యాయి. కాగా, మనీ లాండరింగ్‌, అవినీతి కేసుల్లో మరో మాజీ ప్రధాని షేర్‌ బహదూర్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనపై వచ్చిన మనీ లాండరింగ్‌ ఆరోపణలను ఖండిస్తున్నానని.. నా కుటుంబ ఆస్తులకు సంబంధించి అసత్య ప్రచారం జరుగుతోందని బహదూర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ర్యాపర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలేంద్ర షా నేపాల్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన సంగతి తెలిసిందే బాలెన్‌గా పాపులర్‌ అయిన బాలేంద్రషా గత ఏడాది జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బాలేంద్ర షా నేతృత్వంలోని పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించింది.


 

Advertisement
 
Advertisement
Advertisement