నేపాల్‌ వరద బీభత్సం.. 700 దాటిన మృతుల సంఖ్య | Nepal Flash Floods August 29, 2026 Updates | Sakshi
Sakshi News home page

నేపాల్‌ వరద బీభత్సం.. 700 దాటిన మృతుల సంఖ్య

Aug 29 2026 11:24 AM | Updated on Aug 29 2026 11:36 AM

Nepal Flash Floods August 29, 2026 Updates

నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 700 దాటింది. 2,426 మంది గల్లంతయ్యారు. 5,851 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 8,791 మంది పోలీసు సిబ్బంది సేవలందిస్తున్నారు. జిల్లాల వారీగా మృతుల జాబితాను నేపాల్ ప్రభుత్వం విడుదల చేసింది.

రసువా-13, ధాదింగ్-45, గోర్కా-48, నవల్పూర్ (తూర్పు)-158, నువాకోట్- 49, చిత్వన్-233, తనహు-31, నవల్పూర్ (పశ్చిమ) -40 మంది మృతి చెందారు. రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో అధిక సంఖ్యలో గాయపడినట్లు నేపాల్ పోలీసుల వెల్లడించారు. ఖాట్మండు లోయలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారిలో 140 మంది డిశ్చార్జ్ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల తొలగింపు, గల్లంతైన వారి కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు.

త్రిశూలి నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నేపాల్ వరద సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. త్రిశూలిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తాత్కాలికంగా హెలికాప్టర్, సహాయక చర్యలను అధికారులు నిలిపివేశారు. నది నీటిమట్టం పెరుగుతూనే ఉండటంతో ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. నేపాల్‌కు మరింత వరద సహాయం పంపించాలని విజ్ఞప్తి చేశారు. వరదల్లో చిక్కుకున్న 320 మంది భారతీయులను రక్షించేందుకు తగ్గిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: యుగాంతం రేంజ్‌లో ముప్పు?.. నేపాల్‌కు చైనా మరో డెడ్లీ వార్నింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement