breaking news
napal
-
వరదల్లో ఈశా సభ్యుల గల్లంతు.. రంగంలోకి సద్గురు
-
నేపాల్ జల ప్రళయం: ‘ఈషా’ బృందం గల్లంతు.. రంగంలోకి సద్గురు
ఖాట్మండు/న్యూఢిల్లీ: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది సభ్యుల బృందం చిక్కుకుంది. ఆగస్టు 26న వారు గైరోంగ్ వద్ద గల ఇమ్మిగ్రేషన్ భవనంలో ఉండగా ఈ విపత్తు సంభవించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు, బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు స్వచ్ఛంద సేవకులతో కలిసి అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ అధికారులను, రాయబార కార్యాలయాలను కోరారు.ఈ బృందంలో పలు దేశాలకు చెందిన 34 మంది పురుషులు, 46 మంది మహిళలతో పాటు ముగ్గురు వాలంటీర్లు, ఒక వైద్యుడు ఉన్నారు. అమెరికా నుంచి 22 మంది, కెనడా నుంచి 12 మంది, ఆస్ట్రేలియా నుంచి 11 మంది, బ్రిటన్ నుంచి 9 మందితో పాటు జర్మనీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, రష్యా తదితర దేశాలకు చెందిన పౌరులు ఇందులో ఉన్నారు. బుధవారం ఉదయం 9:05 గంటలకు గ్రూప్ లీడర్ ప్రవీణ్ తాము ఇమ్మిగ్రేషన్ ప్రాంతానికి చేరుకున్నామని సందేశం పంపారని, సరిగ్గా 9:14 గంటల సమయంలో వరద విరుచుకుపడిందని సద్గురు పేర్కొన్నారు. ఆ తర్వాత వారి ఫోన్లు పనిచేయడం లేదని తెలిపారు.వరదల తీవ్రతకు ఇమ్మిగ్రేషన్ భవనం పూర్తిగా కొట్టుకుపోవడమే కాకుండా రహదారులు, సమాచార వ్యవస్థలు స్తంభించిపోయాయి. శిథిలాలు, ప్రమాదకర పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దాదాపు 484 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోందని, మొత్తం బాధితుల సంఖ్య 1,500 కంటే ఎక్కువగా ఉండవచ్చని సద్గురు అంచనా వేశారు. ప్రస్తుతం భారత, చైనా, అమెరికా రాయబార కార్యాలయాలు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితుల సమాచారం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.ఇది కూడా చదవండి: నేపాల్ వరదలు: సరిహద్దుల్లో స్తంభించిన వ్యాపారం -
ఎన్నికలు సజావుగా సాగేందుకు... గిఫ్ట్‌గా 200 వాహనాలు
నవంబర్ 20న నేపాల్‌లో ఫెడరల్ పార్లమెంట్‌తో సహా, ప్రావీన్షియల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసింది. ఐతే అక్కడ సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగేందుకు నేపాల్ వాహనాల కోసం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు భారత కార్యరాయబార కార్యాలయం పేర్కొంది. దీంతో భారత ప్రభుత్వం మంగళవారం వివిధ నేపాలీ సంస్థలకు లాజిస్టకల్ మద్దతు కోసం దాదాపు 200 వాహనాలను బహుమతిగా ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రభుత్వం తరుఫున నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్ 200 వాహానాలను నేపాల్ ఆర్థిక మంత్రి జనార్దన్ శర్మకు అందజేశారు. ఈ రెండు వందల వాహనాల్లో సుమారు 120 భద్రతా బలగాలకు, 80 వాహనాలు నేపాల్ ఎన్నికల కమిషన్‌కు చెందినవని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు శీవాస్తవ్ మాట్లాడుతూ...నేపాల్ ప్రభుత్వ ఎన్నికల కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో ఈ వాహనాలు ఉపకరిస్తాయని ఆశిస్తున్నాను. ఈ ఎన్నికలు నేపాల్ విజయవంతంగా నిర్వహించాలి అని ఆకాంక్షించారు. ఈ వాహానాలను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు, అలాగే నేపాల్ అభివృద్ధిలో నిరంతరం భాగస్వామ్యం అవుతున్నందుకు భారత్ ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్క్షతలు తెలిపారు నేపాల్ మంత్రి జనార్దన్ శర్మ. అదీగాక ఎన్నికల సమయంలో వివిధ నేపాలీ సంస్థలకు దాదాపు 2400 వాహానాలు గిఫ్ట్‌గా వచ్చాయి. అందులో నేపాల్ పోలీసులకు, సాయుధ బలగాలకు సుమారు 2000 వాహనాలు కాగా, నేపాల్ సైన్యం, ఎన్నికల కమిషన్‌కి దాదాపు 400 వాహనాలు బహుమతులుగా వచ్చాయి. (చదవండి: మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్ బరిలోకి) -
నేపాల్ యువకుడి అదృశ్యం
తాటిచెట్లపాలెం: మతిస్థిమితం లేని నేపాల్‌యువకుడు అదృశ్యమైన ఘటన తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. నేపాల్‌కు చెందిన నౌరజ్‌సుమువా(30) ఈనెల 13న భారత్‌కు తన స్నేహితులతో కలిసి వచ్చాడు. తిరుపతినుంచి విశాఖ వచ్చే ఎక్స్‌ప్రెస్ రైళ్లో తన స్నేహితులు ఇరువురితో కలిసి బయలుదేరిన అతడు మార్గమధ్యంలో అదృశ్యమయ్యాడు. ఈనేపథ్యంలో వారు విశాఖ రైల్వేస్టేషన్లో ఫిర్యాదుచేశారు. నేపాల్నుంచి ఢిల్లీ మీదుగా ఆంధ్రప్రదేశ్ చేరుకున్న ఈ నేపాలీయులు దక్షిణ భారతదేశ పర్యటనకు వచ్చారు. అనుకోని విధంగా ఈ యువకుడు అదృశ్యమయ్యారు.


