మతిస్థిమితం లేని నేపాల్‌యువకుడు అదృశ్యమైన ఘటన తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది
నేపాల్ యువకుడి అదృశ్యం
Jul 26 2016 9:12 PM | Updated on Oct 9 2018 5:39 PM
తాటిచెట్లపాలెం: మతిస్థిమితం లేని నేపాల్‌యువకుడు అదృశ్యమైన ఘటన తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. నేపాల్‌కు చెందిన నౌరజ్‌సుమువా(30) ఈనెల 13న భారత్‌కు తన స్నేహితులతో కలిసి వచ్చాడు. తిరుపతినుంచి విశాఖ వచ్చే ఎక్స్‌ప్రెస్ రైళ్లో తన స్నేహితులు ఇరువురితో కలిసి బయలుదేరిన అతడు మార్గమధ్యంలో అదృశ్యమయ్యాడు. ఈనేపథ్యంలో వారు విశాఖ రైల్వేస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. నేపాల్‌నుంచి ఢిల్లీ మీదుగా ఆంధ్రప్రదేశ్ చేరుకున్న ఈ నేపాలీయులు దక్షిణ భారతదేశ పర్యటనకు వచ్చారు. అనుకోని విధంగా ఈ యువకుడు అదృశ్యమయ్యారు.
Advertisement
Advertisement