నేపాల్‌ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్‌

Nepal elects Ram Chandra Poudel of Nepali Congress as new President - Sakshi

ఖట్మాండు: నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్‌ ఎన్నికయ్యారు. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామచంద్రను ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడంతో ప్రధానమంత్రి ప్రచండ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.  అధికార సంకీర్ణ కూటమి అభ్యర్థి రామచంద్రను ఎన్నిక కోసం తెరవెనుక ప్రచండ పన్నిన రాజకీయ వ్యూహాలు ఫలించాయి.

ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్‌ (మావోయిస్టు సెంటర్‌) తో పాటు ఎనిమిది పార్టీల సంయుక్త అభ్యర్థి రామచంద్ర తన ప్రత్యర్థి పార్లమెంటులో రెండో అతి పెద్ద పార్టీ సీపీఎన్‌–యూఎంఎల్‌ మద్దతునిచ్చిన అభ్యర్థి సుభాష్‌ చంద్ర నెబ్‌మాంగ్‌పై విజయం సాధించారు. రామచంద్రకు 214 మంది ఎంపీలు, 352 మంది ప్రావిన్షియల్‌ అసెంబ్లీ సభ్యుల ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అధ్యక్షుడిగా గెలిస్తే నేపాల్‌ ప్రభుత్వంపై ఆ ప్రభావం పడే అవకాశం ఉండేది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top