వైరల్‌ వీడియో: మంటకలిసిన మంచు | man uses a flamethrower to clear snow In USA | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: మంటకలిసిన మంచు

Dec 28 2020 2:38 PM | Updated on Dec 28 2020 2:42 PM

 man uses a flamethrower to clear snow In USA - Sakshi

మానవ మెదడుకు పదును పెడితే ఎలాంటి సమస్యకైనా సులువుగా పరిష్కారాన్ని కనిపెట్టవచ్చిని ఓ వ్యక్తి నిరూపించాడు. కష్టతరమైన పనిని మనిషి మేధస్సుతో సునాయాసంగా అధిగమించి ప్రశంసలు పొందుతున్నాడు. చలికాలం వచ్చిందంటే చాలు అమెరికాలో విపరీతమైన మంచు అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తుంది. రాత్రి రోడ్డుపై పార్క్‌ చేసిన కారు కాస్తా.. ఉదయం లేచేసరికి మంచులో మునుగుతుంది. తాజా సీజన్‌లోనూ హిమపాతం అమెరికన్స్‌ను వణికిస్తోంది. రోడ్లతో పాటు ఇంటి పరిసర ప్రాంతాలు సైతం మంచులో ముగినిపోతున్నాయి. రోజూ గంటల తరబడి మంచును తొలగించడం స్థానికులకు కష్టతరంగా మారింది.

ఇటీవల జరిగిన క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదుకు చేరి మంచును తొలగిచేందుకు నానా తిప్పలు పడ్డారు. ఈ క్రమంలోనే టోరంటోకు చెందిన వ్యక్తికి ఓ ఆలోచన తట్టింది. తోటివారి కష్టాలను చూసి చలించి.. మంచును తొలగించేందుకు సునాయాసమైన పద్దతిని కనిపెట్టాలని ఆలోచించసాగాడు. బుర్రకు పదునుపెట్టి అనుకున్నదే తడువుగా ఓ యంత్రాన్ని కనిపెట్టి ఔరా అనిపించాడు. చేతితో పట్టుకునే ఓ గొట్టంతో కూడాని యంత్రాన్ని కనిపెట్టాడు. దానిలో నుంచి వేగంగా వచ్చే మంట మంచును క్షణాల్లో కరిగిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను స్థానికులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అదికాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి మేదస్సుకు చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేందటూ కామెంట్స్‌ పెడుతున్నారు. అతని ఆలోచనకు ఫిదా అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement