నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?

Man Marriage Proposal To Girlfriend By Tattoo On Chest - Sakshi

లండన్‌ : ఏ పని చేసినా.. అందులో తమ ప్రత్యేకతను చాటుకుంటారు కొందరు. అలాంటి కొద్దిమందిలో ఒకడు ఈ స్టోరీలోని ప్రేమికుడు. తన ప్రియురాలిని ‘‘ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’అని అడగటానికి ఏకంగా ఛాతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని నార్‌ఫోక్‌, గ్రేట్‌ యార్‌మౌత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రేట్‌ యార్‌మౌత్‌కు చెందిన 33ఏళ్ల స్మిటెన్‌ బ్రూనో నివెస్‌ తన ప్రియురాలు పాట్రికా కలాడో 34ను పెళ్లి చేసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నాడు. అయితే తన పెళ్లి ప్రపోజల్‌ను ఎలా ఆమెకు చెప్పాలో తెలియలేదు. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ ఓ ట్యాటూలు వేసే షాపు దగ్గరకు వెళ్లారు. పాట్రికా బయట ఉండగా..  స్మిటెన్‌ లోపలికెళ్లి ట్యాటూ వేయించుకోసాగాడు. ( పార్ల‌మెంటులో పోర్న్ ఫొటోలు చూసిన ఎంపీ )

స్మిటెన్, పాట్రికాల జంట

ఓ 45 నిమిషాల తర్వాత బయటకొచ్చిన స్మిటెన్‌ ఆమె దగ్గరకెళ్లి తన ఛాతిపై ఉన్న ‘‘ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని రాసి ఉన్న అక్షరాలను చూపించాడు. ఆ అక్షరాల కింద ఎస్‌, నో అన్న రెండు గడులు కూడా ఉన్నాయి. ‘ పెళ్లికి ఓకే అంటే ఇక్కడ టిక్‌ చేయ్‌!.. లేదంటే..’ అన్నాడు. మొదట ఏమీ అర్థంకాక చూస్తూ ఉండిపోయిన ఆమె ఆ వెంటనే తేరుకుని ఎస్‌ అని ఉన్న గడి మీద పెన్నుతో రాసి పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా, ఇద్దరికీ ఇది వరకే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ భాగస్వాములతో విడిపోయి వేరుగా ఉంటున్నారు. వచ్చే ఆగస్టులో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top