రికార్డు సృష్టించిన మెకంజీ స్కాట్‌ | MacKenzie Scott has become the world richest woman | Sakshi
Sakshi News home page

రికార్డు సృష్టించిన మెకంజీ స్కాట్‌

Sep 3 2020 7:55 PM | Updated on Sep 3 2020 8:34 PM

MacKenzie Scott has become the world richest woman - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: మెకంజీ స్కాట్‌ (50) ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా  ఘనతను దక్కించుకున్నారు. అమెజాన్ షేర్లు లాభాలతో మాకెంజీ ధన వంతుల జాబితాలో టాప్ లోకి దూసుకొచ్చారు.  స్కాట్ నికర విలువ ఇప్పుడు 68 బిలియన్ డాలర్లుకు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ సూచిక ప్రకారం దాత, రచయిత్రి, మెకంజీ  ప్రపంచ ధనిక మహిళగా నిలిచారు. లోరియల్ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ ను అధిగమించారు.  (అమెజాన్‌.. జెఫ్‌ బెజోస్‌ సరికొత్త రికార్డ్‌)

2019లో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తో విడాకుల పరిష్కారం సందర్భంగా స్కాట్ అమెజాన్ షేర్లలో 35 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన 4 శాతం వాటాను అందుకున్నారు. తాజాగా అమెజాన్ షేర్ విలువ భారీగా పెరగడంతో మెకంజీ స్కాట్‌ సంపద పుంజుకుంది. దీంతో ఆమె ప్రపంచంలో12వ సంపన్నురాలుగా నిలిచారు. కాగా ఇప్పటికే 116 సంస్థలకు దాదాపు 1.7 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చినట్లు స్కాట్ జూలైలో ప్రకటించారు. గత మూడు నెలల్లో అమెజాన్ స్టాక్ సుమారు 28శాతం పెరిగింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 90శాతం కంటే ఎక్కువ పెరిగింది. దీంతో బెజోస్ సంపద 202 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ప్రపంచంలో అపర కుబేరుడిగా బెజోస్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా ఈ వారం ప్రారంభంలో, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ మార్క్ జుకర్‌బర్గ్‌ను అధిగమించి ప్రపంచంలో మూడవ ధనవంతుడిగా నిలిచిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement