కారులో చిన్నారి.. అద్దాలు పగులకొట్టిన పోలీసు.. ట్విస్ట్‌ ఏంటంటే | Sakshi
Sakshi News home page

కారులో చిన్నారి.. అద్దాలు పగులకొట్టిన పోలీసు.. ట్విస్ట్‌ ఏంటంటే

Published Sun, Jan 2 2022 1:29 PM

London: Police Mistake Realistic Doll For Abandoned Baby In Car  - Sakshi

లండన్‌: ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల బొమ్మలు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. వాటిని చూస్తుంటూ.. నిజమైనవేవో, టెడ్డీ బొమ్మలేవో గుర్తుపట్టలేనంతగా ఒకేలా ఉంటున్నాయి.. తాజాగా జరిగిన ఒక ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివరాలు.. ఈ ఘటన యూకేలోని క్లీవ్‌ ల్యాండ్‌ జరిగింది. అమీ క్విల్లెన్‌ అనే మహిళ.. తన కూతురు డార్సితో కలిసి షాపింగ్‌ చేయడానికి వెళ్లింది.

డార్సి తాను.. ఆడుకుంటున్న చిన్న బొమ్మను కారు ముందటి సీటులో పెట్టింది. అది అచ్చం చిన్నారిని పోలి ఉంది. అమీ క్విల్లెన్‌ షాప్‌లోపలికి వెళ్లిపోయారు. అప్పుడు మరోక వ్యక్తి తన కారును పార్క్‌ చేయడానికి అక్కడికి చేరుకున్నాడు. అతను కారులో ఒక చిన్నారి ఉండటాన్ని గమనించాడు. దానికి సీటు బెల్టు కూడా ఉంది. వెంటనే ఆశ్చర్యపోయాడు. అతను.. చుట్టుపక్కల ఉన్నవారిని అప్రమత్తం చేశాడు. కారు యజమాని కోసం వెతికారు.

వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. అ‍క్కడికి చేరుకున్న పోలీసులు కారులో చిన్నారిని చూశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కారు అద్దాలను పగులగొట్టారు. అప్పుడు వారు కారు సీటులో ఉన్న చిన్నారిని చూసి షాకింగ్‌కు గురయ్యారు. కారులో ఉన్నది.. నిజమైన చిన్నారి కాదు.. కేవలం బొమ్మమాత్రమే. పాపం.. ఆ బొమ్మ.. అచ్చం చిన్నారిని పోలీ ఉండటం వలన స్థానికులతో పాటు.. పోలీసులు కూడా గందరగోళానికి గురయ్యారు.

ఆ తర్వాత.. అక్కడికి చేరుకున్న అమీ క్విల్లెన్‌కు, పోలీసులు  జరిగిన విషయం తెలిపారు. ఆ బొమ్మ.. తన కూతురికి ఎంతో ఇష్టమని తెలిపారు. క్రిస్టమస్‌కు గిఫ్ట్‌గా ఇచ్చామని తెలిపారు. కాగా, దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ,  కారు మరమ్మత్తుల కోసం డబ్బులు చెల్లిస్తామని ప్రకటించారు. 

చదవండి: ‘కొందరు మనుషుల కన్నా.. నోరు లేని జీవాలే నయం’ . వైరల్‌ వీడియో

Advertisement
Advertisement