Liz Truss: 'తక్షణమే అందుకు రంగంలోకి దిగుతా'.. వర్షంలో తడుస్తూనే...

బ్రిటన్‌ను సంక్షోభం నుంచి బయట పడేసేందుకు తన వద్ద సాహసోపేత ప్రణాళికలున్నాయని ట్రస్ ప్రకటించారు. పన్ను కోతలు, సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తానని ప్రధాని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి చేసిన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు.
‘‘అత్యంత కీలక సమయంలో దేశ సారథ్య బాధ్యతలు చేపట్టడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇంధన కొరత వంటి సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటాం. అందరికీ ఆశించిన అవకాశాలు, అత్యధిక వేతనాలు, సురక్షిత వీధులతో కూడిన ఆకాంక్షల దేశంగా బ్రిటన్‌ను తీర్చిదిద్దుతా. తక్షణమే అందుకు రంగంలోకి దిగుతా’’ అని ప్రకటించారు. పలువురు ఎంపీలు వర్షంలో తడుస్తూనే ప్రసంగం విన్నారు.
చదవండి: (పగ్గాలు చేపట్టిన లిజ్)