పారిశ్రామికుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీకి జో బైడెన్ ప్రత్యేక కానుక 

Joe Biden Special Gift To PM Modi - Sakshi

వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అపురూపమైన బహుమతినిచ్చారు. వైట్ హౌస్ లో జరిగిన ఇరుదేశాల పారిశ్రామికవేత్తల సమావేశంలో ఒక టీషర్టును మోదీకి కానుకగా ఇచ్చారు. దాని మీద AI అంటే అమెరికా ఇండియా భవిష్యత్తు అని మోదీ సరికొత్తగా నిర్వచించిన మాటలను ముద్రించారు.        

అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు యూఎస్ కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. AI అంటే అది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) కానివ్వండి అమెరికా ఇండియా కానివ్వండి. భవిష్యత్తు అంతా AI నే.. అని అన్నారు. అనంతరం ఇరుదేశాలకు చెందిన బడా పారిశ్రామికవేత్తలు పాల్గొన్న సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఒక టీషర్ట్ మీద మోదీ చెప్పిన ఆ మాటలనే ముద్రించి కానుకగా ఇచ్చారు. 

అమెరికా అధ్యక్షుడు కానుక ఇచ్చిన ఆ ఫోటోను ప్రధాని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి ఐక్యంగా పని చేస్తే ఈ భూమి కంటే గొప్ప ప్రదేశం మరొకటి ఉండదని, అమెరికా భారత్ రెండు AI మాదిరిగానే శక్తివంతంగా తయారవుతున్నాయని రాశారు.  

ఈ సమావేశంలో అమెరికా పారిశ్రామికవేత్తలు మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, గూగుల్ అధినేత సుందర్ పిచ్చై, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, ఒపెన్ AI సీఈవో సామ్ ఆల్ట్ మాన్,ఏఎండి సీఈవో లిసా సు, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ లతో పటు భారత పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, నిఖిల్ కామత్, వృందా కపూర్ లు కూడా పాల్గొన్నారు. 

ఇది కూడా చదవండి: వైట్‌హౌస్‌ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్‌ మహీంద్ర

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top