ప్రధాని మోదీకి పుతిన్‌ ఫోన్‌ | Putin dials PM Modi, shares insight on Alaska summit with Trump | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి పుతిన్‌ ఫోన్‌

Aug 18 2025 5:45 PM | Updated on Aug 18 2025 6:26 PM

Putin dials PM Modi, shares insight on Alaska summit with Trump

మాస్కో: అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్  (valdimir Putin) మధ్య ఉక్రెయిన్‌ యుద్ధం ముగించే విషయంపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్లాదిమిర్‌ పుతిన్‌ తనకు ఫోన్‌ చేసినట్లు ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.  

ఆ ట్వీట్‌లో‘ఇటీవల అలాస్కాలో ట్రంప్‌తో జరిగిన సమావేశం గురించి ఫోన్‌లో మాట్లాడి, తన అభిప్రాయాలను పంచుకున్నారు.  నా స్నేహితుడు పుతిన్‌కు ధన్యవాదాలు. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్‌ నిరంతరం కోరుకుంటుంది.ఈ విషయంలో జరుగుతున్న అన్నీ ప్రయాత్నాలకు భారత్‌ మద్దతు పలుకుతుంది’అని పేర్కొన్నారు.  

ఫిబ్రవరి 2022 నుండి కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా యుద్ధంపై ప్రపంచ దేశాల ఎదుట భారత్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని, ఈ విషయంలో భారత్‌ తన పూర్తి మద్దతును అందిస్తుందని ప్రధాని కార్యాలయంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement